బీసీసీఐ కాంట్రాక్టు ఝలక్: సర్ ప్రైజ్ ఇచ్చిన ఎంఎస్ ధోనీ

By telugu teamFirst Published Jan 17, 2020, 5:10 PM IST
Highlights

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు జాబితాలో చోటు కోల్పోయిన రోజునే ఎంఎస్ ధోనీ రాంచీలోని మైదానంలో బ్యాట్ చేతబట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ధోనీ రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.

రాంచీ: టీమిండియా వార్షి కాంట్రాక్టులో చోటు దక్కని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆశ్చర్యకరమైన చర్యకు దిగాడు. తనలో ఇంకా సత్తువ ఉందని నిరూపించుకోవడానికో ఏమో అన్నట్లు మైదానంలోకి అందరినీ ఆశ్చర్య పరిచాడు. వార్షిక కాంట్రాక్టులో చోటు కోల్పోయిన రోజునే ఆయన ఆ పనిచేశాడు. 

తన సొంత నగరం రాంచీలో జార్ఖండ్ రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఓ వైపు ధోనీని బీసీసీఐ కాంట్రాక్టు జాబితా నుంచి తొలగిస్తే మరోవైపు అతను బ్యాటింగ్ ప్రాక్టిస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ లోనే కాకుండా రెగ్యులర్ ట్రైనింగులో కూడా పాల్గొన్నాడు.

Also Read: టీమిండియాలో ధోనీ.. ఇక ఛాన్స్ లేదంటున్న హర్భజన్ సింగ్

ఆ విషయాన్ని జార్ఖండ్ టీమ్ మేనేజ్ మెంట్ వెల్లడించింది. రంజీ ఆటగాళ్లంతా ఎర్రబంతితో ప్రాక్టీస్ చేస్తే ధోనీ మాత్రం తెల్ల బంతితో ప్రాక్టీస్ చేశాడు. తద్వారా తాను ఐపిఎల్ టోర్నమెంట్ కు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. 

ధోనీ ఐపిఎల్ టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఐపిఎల్ లో చేసే ప్రదర్శనను బట్టే టీ20 ప్రపం కప్ పోటీల్లో ధోనీ చోటు దక్కుతుందా, లేదా అనేది ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. 

Also Read: ధోనీ ఖేల్ ఖతమ్: తేల్చేసిన బీసీసీఐ, తెలుగు క్రికెటర్ ఒకే ఒక్కడు

తన సంత్సవరంలో ఏ గ్రేడ్ లో ఉన్న ధోనీకి ఈసారి వార్షిక కాంట్రాక్టులో చోటు కూడా దక్కలేదు. దీంతో అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు. కానీ, ఐపిఎల్ మీదనే అతని రీఎంట్రీ ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. కాంట్రాక్టు జాబితాలో పేరు లేకపోయినప్పటికీ ప్రపంచ కప్ పోటీలకు ఎంపికయ్యే అవకాశం అతనికి ఉందని అంటున్నారు.

click me!