Rohit Sharma Son : వైరల్‌ అవుతోన్న హిట్‌మ్యాన్‌ కొడుకు ఫొటో.. పేరేంటో తెలుసా?

Rohit sharma: ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నేతృత్వంలో  టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ గెలుచుకుంది. అంతకుముందు  టీ-20 వరల్డ్‌ కప్పు కైవసం చేసుకుంది. జట్టుకు రోహిత్‌ కెప్టెన్‌ అయినప్పటి నుంచి టీమిండియాకి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. డాషింగ్‌ ఒపెనర్‌గా జట్టును ముందుకు నడపడంతో రోహిత్‌ దిట్ట. 
 

Rohit Sharma Son Ahaan Sharma First Photo Goes Viral Fans Celebrate Junior Hitman in telugu tbr

రోహిత్‌ ఎక్కడ మ్యాచ్‌ ఆడుతున్నా అతని భార్య స్టేడియంలో కూర్చుని సందడి చేస్తుంది. రోహిత్‌కు ఇద్దరు పిల్లులు.. మొదట అమ్మాయి కాగా.. రెండో సారి బాబు పుట్టాడు.. ఇక హిట్‌మ్యాన్‌ కుమార్తెను అందరూ చూశారు. కానీ కొడుకు ఫొటో మాత్రం బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. అయితే.. ఈ ఐపీఎల్‌ సందర్భంగా హిట్‌మ్యాన్‌ కొడుకు ఫొటో  బయటకు వచ్చింది.

ఫ్యాన్స్‌ జూనియర్‌ రోహిత్‌ అని

రోహిత్ శర్మ కొడుకు పేరు అహాన్ శర్మ... బాబు మొదటి ఫోటో బయటకు రావడంతో ఫ్యాన్స్‌ జూనియర్‌ రోహిత్‌ అని సంబరం చేసుకుంటున్నారు. శర్మ జీ కొడుకు చాలా ముద్దుగా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, అతని భార్య రితికా సజ్దే కొడుకు అహాన్ శర్మ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అహాన్ పుట్టినప్పటి నుంచి అందరూ అతన్న చూసేందుకు ఆసక్తి చూపారు. 

Latest Videos

రీసెంట్‌గా విడుదలైన చిత్రాలలో అహాన్‌ను రోహిత్‌ భార్య రితికా ​​ఎత్తుకుంది. పక్కనే అహాన్‌ అక్క సమైరా కూడా కూర్చుని కనిపించింది. తమ్ముడిని చక్కగా ఆడిస్తూ.. ప్రేమగా చూసుకోంటోంది సమైరా. రోహిత్ శర్మకు 2024లో కొడుకు పుట్టాడు. 2024 నవంబర్ 15న పుట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబు ఎలా ఉంటాడు అన్నది ఎవరికీ తెలియదు. దంపతులు ఇద్దరు బాబు ఫొటోలు బయట పెట్టలేదు. బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లలేదు. రోహిత్‌ దంపతులు కూడా ఈవిషయంలో చాలా జాగ్రత్తులు పడ్డారు. 

విడుదలైన రోహిత్‌ కుమారుడి ఫొటోలను హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రోహిల్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడు.. ముంబయి జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే.. ఈ ఐపీఎల్‌లో రోహిత్ పేలవమైన ఫాంలో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన అయిదు మ్యాచ్‌లలో బ్యాట్‌తో పెద్దగా రాణించలేదు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 56 పరుగులు మాత్రమే చేశాడు, 

vuukle one pixel image
click me!