
ఇండియన్ టీం మాజీ బౌలర్ జహీర్ ఖాన్ రీసెంట్‌గా తండ్రయ్యాడు. చక్ దే ఇండియా సినిమాలో నటించిన నటి సాగరిక ఘాట్గే అతని భార్య. ఈ దంపతులకు ఇటీవల మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని సాగరిక తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేయడంతో అందరికీ తెలిసింది. ఈ జంట శుభవార్తను పంచుకున్న వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ శుభాకాంక్షలతో ముంచెత్తారు. క్రికెట్ ప్లేయర్ల దగ్గరి నుంచి బాలీవుడ్ నటులు, ప్రముఖుల వరకు అందరూ వారిని అభినందిస్తున్నారు. జహీర్ ఖాన్ కూడా ఆ బాబు పేరును సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
జహీర్ ఖాన్, సాగరిక దంపతులు ఇన్‌స్టాగ్రంలో రెండు ఫోటోలను షేర్ చేశారు. ఇందులో నలుపు మరియు తెలుపు ఫొటోలు ఉన్నాయి.. మొదటి ఫోటోలో బిడ్డతో వారు స్టిల్స్ ఇచ్చినట్లు ఉంది. దీనిలో జహీర్ ఖాన్ తన కొడుకును తన ఒడిలో పెట్టుకుని ఉన్నాడు. రెండో ఫోటోలో చిన్నారి చేయి పట్టుకుని ఉన్నారు. ఈ రెండు ఫోటోలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ జంట ఫేస్‌లో బాబు పుట్టిన సందర్భంగా ఎంత సంతోషంగా ఉన్నారో ఫోటోలో స్పష్టంగా తెలుస్తోంది. జహీర్ ఖాన్ కొడుకు పేరు ఫోటోను షేర్ చేస్తూ... నోట్ కూడా రాశారు. దేవుడి ప్రేమ, కృప, ఆశీర్వాదంతో తమ బిడ్డకు ఫతే సింగ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు.
ప్రస్తుతం వీరు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సురేష్ రైనా నుంచి నుండి అంగద్ బేడి వరకు, అందరు క్రికెటర్లు జహీర్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఇక దాదాపు ఎనిమిదేళ్ల నీరక్షణ తర్వాత.. జహీర్ ఖాన్ ఇల్లు ఆనందంతో సందడిగా మారింది.
తొలుత జహీర్ , సాగరిక చాలా కాలం డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2016 యువరాజ్ సింగ్ వివాహ సమయంలో సాగరిక, జహీర్ తమ రిలేషన్‌ను బయట పెట్టారు. ఆ తర్వాత సంవత్సరం అంటే 2017లో పెళ్లి చేసుకున్నారు. నేటికి సరిగ్గా ఎనిమిదేళ్లు కావస్తోంది. ఈ తరుణంలో ఒక కొత్త అతిథి వారి తలుపు తట్టి.. ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.