T20 World Cup 2024 : వెస్టిండీస్ కు బిగ్ షాక్.. సెమీ ఫైన‌ల్ కు దక్షిణాఫ్రికా

By Mahesh RajamoniFirst Published Jun 24, 2024, 12:59 PM IST
Highlights

T20 World Cup 2024 - WI vs SA : దక్షిణాఫ్రికాకు వర్షం ఒక వరంగా మారింది. సెమీ-ఫైనల్‌లో వ‌ర్షంతో వెస్టిండీస్ కల చెదిరిపోయింది. ఎనిమిదేళ్లుగా టీ20 ప్రపంచకప్ ట్రోఫీపై కన్నేసిన వెస్టిండీస్ ఆశ‌లు ఆవిరి అయ్యాయి. ప్రోటీస్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2024 లో సెమీస్ కు చేరుకుంది.  
 

T20 World Cup 2024 - WI vs SA : టీ20 ప్రపంచ కప్ 2024లో మరో సెమీ-ఫైనలిస్ట్ క‌న్ఫార్మ్ అయింది. సూప‌ర్-8 మ్యాచ్ లో వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌లో ప్రోటీస్ జట్టుకు వర్షం వరంగా మారింది. 8 ఏళ్లుగా టీ20 ప్రపంచకప్ ట్రోఫీపై కన్నేసిన వెస్టిండీస్ డూ ఆర్ డై మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 నుంచి ఔట్ అయింది. సూప‌ర్-8 గ్రూప్-2లో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్ కు చేరుకుంది. ఈ గ్రూప్‌ నుంచి రెండో జట్టుగా దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌లోకి చేరుకోగా, ఇదివ‌ర‌కే ఇంగ్లాండ్ కూడా సెమీస్ కు చేరుకుంది.

రోస్టన్ చేజ్ హార్డ్ వర్క్ ఫలించలేదు

Latest Videos

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. జట్టు నుంచి అద్భుతమైన బౌలింగ్ కనిపించింది. అయితే, విండీస్ స్టార్ రోస్టన్ చేజ్ వెస్టిండీస్ ట్రబుల్ షూటర్ అని నిరూపించుకుంటూ 42 బంతుల్లో 52 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కైల్ మేయర్స్ కూడా 35 పరుగులు చేశాడు. అయితే, ఆ సౌతాఫ్రికా బౌల‌ర్లు క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ చేయ‌డంతో విండీస్ టీమ్ పెద్ద స్కోర్ చేయ‌లేక‌పోయింది. మిగ‌తా ప్లేయ‌ర్లు కూడా పెద్ద‌గా స్కోర్లు చేయ‌లేక‌పోయారు. 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోస్ట‌న్ చేజ్ బంతితోనూ అద్భుతాలు చేసి 3 వికెట్లు పడగొట్టి అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు.

టీ20 ప్రపంచకప్‌ హిస్టరీలో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

వర్షం విండీస్ ను దెబ్బ‌కొట్టింది

136 పరుగుల విజయలక్ష్యంతో  బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు ఆరంభం అంత‌బాగా ల‌భించ‌లేదు. త్వ‌ర‌గానే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే, ఇదే స‌మ‌యంలో వ‌ర్షం కూడా మ్యాచ్ కు అంత‌రాయం క‌లిగించింది. ఆండ్రీ రస్సెల్ తన ఒకే ఓవర్‌లో కేవలం 15 పరుగుల వద్ద ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మెన్‌లకు పెవిలియన్ కు పంపాడు. అయితే ఆ తర్వాత కుండపోత వర్షం కురవడంతో వెస్టిండీస్ లయ కోల్పోయింది. కొంత సమయం తర్వాత మ్యాచ్ ప్రారంభం కాగానే 17 ఓవ‌ర్లకు కుదించడంతో  లక్ష్యం 123 పరుగులగా నిర్ణ‌యించారు. ఆ తర్వాత మ్యాచ్‌పై ఆఫ్రికా పట్టు సాధించింది.

స్టబ్స్-రబడాలు రాణించడంతో.. 

దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్లు ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ లు కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర‌లో మార్కో జాన్సెన్ 21 ప‌రుగుల‌తో జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. సౌతాఫ్రికాకు 7 బంతుల్లో 9 పరుగులు అవసరమైనప్పుడు, రబడ ఒక ఫోర్ కొట్టి మ్యాచ్‌ని త‌మ జ‌ట్టువైపు తీసుకువ‌చ్చాడు. దీని త‌ర్వాత చివరి ఓవర్‌లో మార్కో జాన్సెన్ అద్భుతమైన సిక్సర్ కొట్టి ప్రోటీస్ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. బౌలింగ్ లో ఆఫ్రికన్ బౌలర్లలో తబ్రేజ్ షమ్సీ అద‌ర‌గొట్టాడు. జట్టు తరఫున 3 కీల‌క‌మైన వికెట్లు పడగొట్టాడు. అలాగే, మార్కో జాన్సెన్, ఐడెన్ మార్క్రామ్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీశారు. గ్రూప్-2లో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ జట్టు జూన్ 26న సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడ‌నుంది.

 

What a finish in Antigua 🥵

The Proteas go through to the Semi-Finals 🌟 📝 https://t.co/Gv3hNXD6c4 pic.twitter.com/tWbznVDrIk

— ICC (@ICC)

 

యువరాజ్ సింగ్ చేయలేదని హార్దిక్ పాండ్యా సాధించాడు.. 

click me!