రితికాపై రోహిత్ శర్మ స్పెషల్ కేర్... సూపర్ ఇన్నింగ్స్ తర్వాత భార్యకు మాసాజ్ చేస్తూ...

Published : Feb 14, 2021, 11:23 AM IST
రితికాపై రోహిత్ శర్మ స్పెషల్ కేర్... సూపర్ ఇన్నింగ్స్ తర్వాత భార్యకు మాసాజ్ చేస్తూ...

సారాంశం

తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసిన రోహిత్ శర్మ... ఒకరోజు ముందే భార్యకి వాలెంటైన్స్ డే కానుక... మొదటి రోజు ముగిసిన తర్వాత భార్యకు మసాజ్...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ. 86 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాకు తన బ్యాటింగ్‌తో మంచి గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 161 పరుగులు చేసిన రోహిత్ శర్మ, టెస్టుల్లో ఏడో సెంచరీ, నాలుగోసారి 150+ స్కోరు నమోదుచేశాడు. వాలెంటైన్స్ డేకి ముందు రోజు ఆడిన ఇన్నింగ్స్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిన రోహిత్ శర్మ, స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన తన సతీమణి రితికా శర్మకు పర్ఫామెన్స్‌తోనే గిఫ్ట్ ఇచ్చాడు.

అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు చాలా టెన్షన్‌గా గమనిస్తూ కనిపించిన రితికా, హిట్ మ్యాన్ నుంచి బౌండరీ వచ్చినప్పుడల్లా చప్పట్లతో అభినందిస్తూ కనిపించింది. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం రితికా శర్మ వేళ్లకు, కూతురు సమైరాతో కలిసి మసాజ్ చేస్తున్న ఫోటోను పోస్టు చేశాడు రోహిత్ శర్మ.

 

‘వేళ్లు బాగానే ఉన్నట్టున్నాయి. సామీ, నేను కలిసి ఈ అలసిన వేళ్లకు మసాజ్‌ చేశాం’ అంటూ ట్వీట్ చేశాడు రోహిత్ శర్మ. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !