
ఓవర్‌నైట్ స్కోరు 300/6 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి... మొదటి ఓవర్‌లోనూ ఊహించని షాక్ తగిలింది. మొయిన్ ఆలీ బౌలింగ్‌లో రెండో బంతికే అక్షర్ పటేల్ అవుట్ కాగా, ఆ తర్వాత రెండు బంతులకే ఇషాంత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు.
రిషబ్ పంత్ మొదటి బంతికే సింగిల్ తీయడంతో రెండో రోజు మొదటి ఓవర్‌లో ఇంగ్లాండ్‌కి రెండు వికెట్లు దక్కాయి. ఓవర్‌నైట్ స్కోరుకి 50- 75 పరుగులు జోడించి, ఇంగ్లాండ్‌పై పట్టు సాధించాలనుకున్న టీమిండియాకు మొదటి ఓవర్‌లోనే ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది.
రిషబ్ పంత్ ఇంకా క్రీజులోనే ఉన్నా, టెయిలెండర్లతో అతను ఎంత సేపు బ్యాటింగ్ కొనసాగిస్తాడనేదానిపై టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆధారపడి ఉంది. జో రూట్ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదాడు రిషబ్ పంత్.