ఆసియా కప్ సాధించిన రోహిత్ శర్మ..ముంబయిలో ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!

By telugu news team  |  First Published Sep 20, 2023, 9:31 AM IST

ఫ్యాన్స్ మాత్రమే కాదు, పలువురు పోలీసు అధికారులు సైతం ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం  చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబయి చేరుకున్నారు. ఇటీవల ఆసియాకప్ 2023కోసం ఆయన తలపడిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా అదరగొట్టింది. చివరకు కప్ టీమిండియాను వరించింది. ఈ టోర్నీ ముగియడంతో  ఆయన ముంబయి చేరుకున్నారు. కాగా, ముంబయి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.

ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగపడ్డారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, పలువురు పోలీసు అధికారులు సైతం ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం  చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Latest Videos

undefined

ఇదిలా ఉండగా, ఆసియా కప్ అలా ముగిసిందో లేదో, టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 22, 24, 27 తేదీలలో ఇండియాలో భారత్ ఆస్ట్రేలియాల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సెప్టెంబర్ 18వ తేదీన రెండు వేర్వేరు జట్టను ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈసారి రెస్ట్ ఇచ్చారు. ఆయనతోపాటు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు కూడా విశ్రాంతి దొరికింది.  

After winning Asia Cup 2023 GREATEST CAPTAIN ROHIT SHARMA arrives in Mumbai.

Clicked pictures with fans and Police Officers pic.twitter.com/hfBfOeekdV

— Immy² (@BeingImRo45)

సెలెక్టర్లు వీరందరికీ ఈ వన్డే సిరీస్ మ్యాచ్ లో  మొదటి రెండు మ్యాచ్ లకు రెస్ట్ ఇచ్చారు. రెగ్యులర్ కెప్టెన్ రెస్ట్ లో ఉండడంతో టీమిండియా కు ప్రస్తుతం కెఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. తొలి రెండు మ్యాచ్లకు కే ఎల్ రాహుల్ కు డిప్యూటీగా రవీంద్ర జడేజా ఉంటారు.  మూడో వన్డేలో రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తారు.  రోహిత్ శర్మతోపాటు హార్థిక్ పాండ్యాలు, కుల్దీప్ యాదవ్, విరాట్ కోహ్లీలు కూడా మూడో వన్డేలో జట్టులోకి వచ్చి చేరతారు. 

 

ఇక ఈ సిరీస్ ముగియగానే వరల్డ్ కప్ సన్నాహక మ్యాచులు ప్రారంభమవుతాయి. 7, 8 రోజుల తేడాతో అక్టోబర్ ఐదు నుంచి వరల్డ్ కప్ మ్యాచ్లు స్టార్ట్ అవ్వబోతున్నాయి. 2023 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్- గత ఎడిషన్ రన్నర్ ఆఫ్ న్యూజిలాండ్ మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. అ క్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో మెగాటోర్నీలో భారత్ తొలి మ్యాచ్ ఆడబోతోంది.  

click me!