దినేష్ కార్తీక్ కి ముద్దుపెట్టిన రోహిత్ శర్మ...!

By telugu news teamFirst Published Sep 26, 2022, 10:28 AM IST
Highlights

ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. అయితే... ఈ మ్యాచ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దినేష్ కార్తీక్ కి.. రోహిత్ శర్మ ముద్దు పెట్టాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది. 2-1 తేడాతో సిరీస్ ని దక్కించుకుంది. ఆదివారం హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. అయితే... ఈ మ్యాచ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దినేష్ కార్తీక్ కి.. రోహిత్ శర్మ ముద్దు పెట్టాడు.

అసలు మ్యాటరేంటంటే... చాహల్ బౌలింగ్ ప్రారంభించాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని మ్యాక్స్ వెల్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు. బౌండరీ వద్ద అద్భుతంగా బాల్ అందుకున్న అక్షర్ పటేల్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్ట్రైకర్ ఎండ్ వైపు బాల్ విసిరాడు. అయితే రెండో రన్ కోసం ప్రయత్నిస్తున్న మ్యాక్సీ ఆ బంతి నేరుగా వికెట్లను తాకుతుందని అస్సలు ఊహించి ఉండడు. అందుకే డైవ్ దూకలేదు. ఇక దినేష్ కార్తీక్ సైతం తొలుత గ్లవ్స్ వికెట్లకు తాకించడంతో ఒక బెయిల్ ముందే లేచింది. అయితే బాల్ నేరుగా వచ్చి వికెట్లకు తాకడంతో రెండో బెయిల్ కూడా లేచింది. దీంతో అంపైర్ ఔటిచ్చాడు.

కాగా... ఈ ఘటనపై ముందు సీరియస్ అయిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత ముద్దు ఇవ్వడం విశేషం. బాల్ రాకముందే దినేశ్ తన గ్లోవ్స్ తో వికెట్లను పడేయటం పైన తొలుత రోహిత్ కొంత ఆగ్రహంగా కనిపించాడు. కానీ, థర్డ్ అంపైర్ దీనికి అవుట్ గా ప్రకటించటంత రోహిత్ నవ్వుకుంటూ వచ్చి డీకే హెల్మెట్ ముద్దాడాడు. కాగా.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

 

pic.twitter.com/KhmwE0u5ZL

— Heisenberg (@Heisenb02731161)


 

click me!