హైదరాబాద్ బిర్యానీ రుచిచూసిన రోహిత్ శర్మ...!

Published : Sep 26, 2022, 09:43 AM IST
  హైదరాబాద్ బిర్యానీ రుచిచూసిన రోహిత్ శర్మ...!

సారాంశం

ఆ టేస్ట్ కి రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ లు ఫిదా అయ్యారు. బిర్యానీ అద్భుతంగా ఉందని ఆయన చెప్పడం విశేషం. ఈ సందర్భంగా తమకు అంత రుచికరమైన బిర్యానీని అందించిన గోల్కొండ హోటల్ సిబ్బందితో సెల్ఫీ దిగారు. ఆ ఫోటోని కూడా చేశారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... హైదరాబాద్ బిర్యానీని రుచి చూశారు. ఆ బిర్యానీ రుచికి ఆయన ఫిదా అయ్యారు. ఆదివారం ఆస్ట్రేలియా-భారత్ మధ్య టీ20 సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా... ఈ మ్యాచ్ కోసం  రోహిత్ శర్మ శనివారమే హైదరాబాద్ నగరానికి వచ్చారు. రోహిత్ తో పాటు... ఇతర జట్టు సభ్యులు సైతం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో బస చేశారు.

కాగా... అదే రోజు భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానం మేరకు రోహిత్  శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర అసిస్టెంట్లతో కలిసి  ఆయన డిన్నర్ కి వెళ్లారు. గోల్కొండ హోటల్ లో తయారు చేసిన బిర్యానీని వారు రుచి చూశారు. ఆ టేస్ట్ కి రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ లు ఫిదా అయ్యారు. బిర్యానీ అద్భుతంగా ఉందని ఆయన చెప్పడం విశేషం. ఈ సందర్భంగా తమకు అంత రుచికరమైన బిర్యానీని అందించిన గోల్కొండ హోటల్ సిబ్బందితో సెల్ఫీ దిగారు. ఆ ఫోటోని కూడా షేర్ చేశారు.


ఇదిలా ఉండగా ఆదివారం నగరంలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. 2-1 తేడాతో.. సిరీస్ ని కైవసం టీమిండియా కైవసం చేసుకుంది. టీమిండియా గెలవడంతో... అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా... ప్రస్తుతం జట్టు.. త్వరలోనే  స్వదేశంలో జరగనున్న దక్షిణాఫ్రికాతో సిరీస్ కి రెడీ అవుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే