India vs England : టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్నాడు. సూపర్-8 లో ఆస్ట్రేలియాపై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్ సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ కు బిగ్ షాకిచ్చాడు. ఈ క్రమంలోనే అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు.
IND vs ENG, T20 World Cup 2024 : ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మంచి టచ్ లో ఉన్నాడు. భారత కెప్టెన్ పరుగుల వరద పారిస్తూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం టోర్నమెంట్‌లో 200+ పరుగులతో మూడు హాఫ్ సెంచరీలతో టీమ్ ఇండియాకు అత్యధిక రన్-గెటర్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెమీ-ఫైనల్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌ల వికెట్లను భారత్ త్వరగానే కోల్పోయిన సమయంలో రోహిత్ శర్మ మంచి నాక్ ఆడాడు. భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మెరుపు హాఫ్ సెంచరీతో భారత జట్టుకు మంచి స్కోర్ స్థితికి తీసుకెల్లాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టాడు.
ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో భారీ ఫీట్ సాధించాడు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ వంటి వారితో కలిసి భారత జాతీయ క్రికెట్ జట్టు నాయకుడిగా ఓపెనింగ్ బ్యాటర్ గా 5000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ-ఫైనల్ 2లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 92 పరుగులతో సంచలనం సృష్టించిన రోహిత్ శర్మ, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా తన గోల్డెన్ టచ్ కొనసాగించాడు. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో మరో హాఫ్ సెంచరీ (57 పరుగులు) సాధించాడు.
undefined
సెమీ ఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమికి కారణాలు ఇవే
భారత కెప్టెన్‌గా అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన టాప్-5 లిస్టులో చేరాడు. ఈ ఎలైట్ జాబితాలో రోహిత్ శర్మ 5వ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులతో టాప్ లో ఉన్నాడు. కింగ్ కోహ్లీ కెప్టెన్‌గా 12883 పరుగులు చేశాడు.ఆ తర్వాత టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని 11207 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ అజారుద్దీన్ (8095 పరుగులు), సౌరవ్ గంగూలీ (7643 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ 5000+ పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ (4508), రాహుల్ ద్రవిడ్ (4394), సునీల్ గవాస్కర్ (4151),కపిల్ దేవ్ లు (2928) ఉన్నారు.
భారత కెప్టెన్‌గా అత్యధిక అంతర్జాతీయ పరుగుల చేసిన ప్లేయర్ల జాబితా:
టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ కు షాకిచ్చిన రోహిత్ శర్మ..