రోహిత్ కు కాస్త ఇబ్బందే... కానీ ఇదే మంచి అవకాశం: సంజయ్ బంగర్

Published : Sep 15, 2019, 11:47 AM IST
రోహిత్ కు కాస్త ఇబ్బందే... కానీ ఇదే  మంచి అవకాశం: సంజయ్ బంగర్

సారాంశం

టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మకు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మద్దతుగా నిలిచారు. అతడు టెస్ట్ ఓపెనర్ గా కూడా చరిత్ర సృష్టించనున్నాడని బంగర్ తెలిపాడు.  

టీమిండియా సీనియర్ ప్లేయర్, హిట్ మ్యాచ్ రోహిత్ శర్మకు అద్భుత అవకాశం లభించింది. ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఓపెనర్ గా తానేంటో నిరూపించుకున్న రోహిత్ ఇక టెస్టుల్లోనూ సత్తా చాటెందుకు సిద్దమయ్యాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సీరిస్‌లో రోహిత్ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయమయ్యింది. ఈ నేపథ్యంలో టీమిండియా  మాజీ బ్యాంటింగ్  కోచ్ సంజయ్ బంగర్ అతన్ని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

''రోహిత్ మంచి  టాలెంట్ వున్న బ్యాట్స్ మెన్. అతడి బ్యాటింగ్ స్టైల్ కేవలం పరిమిత  ఓవర్ల క్రికెట్ కే కాదు టెస్టులకు కూడా సరిపోయేలా వుంటుంది. అయితే అతడు తన ప్రత్యేక బ్యాటింగ్ స్టైల్ నే  టెస్టుల్లోనూ కొనసాగించాలని... అప్పుడే  విజయవంతం అవుతాడని సూచించాడు. చాలాకాలంగా అతడు టెస్ట్ క్రికెట్ కు దూరమవడమే కాదు ఈ ఫార్మాట్ లో కొత్తగా ఓపెనింగ్  చేస్తున్నాడు. కాబట్టి మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా గాడిలో పడ్డాక అతన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు. భారీ లక్ష్యాలను కూడా ఒంటిచేత్తో చేదించగల సత్తా రోహిత్ సొంతం. '' అంటూ రోహిత్ ను బంగర్ ప్రశంసలతో ముంచెత్తాడు. 

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా జరిగిన టెస్ట్ సీరిస్ లో రోహిత్ కేవలం  డ్రెస్సింగ్ రూం కే పరిమితమయ్యాడు. అతన్నికాదని టీమిండియా  మేనేజ్ మెంట్ కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లను ఓపెనర్లుగా బరిలోకి దింపింది. అంతేకాకుండా తెలుగు తేజం హనుమ విహారికి మిడిల్ ఆర్డర్ లో అవకాశం  కల్పించారు. వీరిలో మయాంక్, విహారీ లు రాణించగా  రాహుల్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడికి సౌతాఫ్రికా తో జరగనున్న టెస్ట్ సీరిస్ నుండి తప్పించిన ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్ కు అవకాశం కల్పించారు. 

  

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !