MI vs DC Highlights : ఐపీఎల్ 2024లో ముంబైకి తొలి విజ‌యం.. 400+ ప‌రుగులు కొట్టేశారు..

By Mahesh Rajamoni  |  First Published Apr 7, 2024, 10:24 PM IST

MI vs DC Highlights, IPL 2024 : ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని అందుకుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ సీజన్ లో ముంబైకి తొలి విజయం ఇదే.


MI vs DC  : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ లో 20వ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్-ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ్డాయి. రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్, టిమ్ డెవిడ్, రొమారియో షెపర్డ్ ల సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఢిల్లి క్యాపిట‌ల్స్ ను చిత్తు చేసి తొలి విజ‌యాన్ని అందుకుంది ముంబై ఇండియ‌న్స్,  ఈ మ్యాచ్ లోటాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియ‌న్స్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టి 5 వికెట్లు కోల్పోయి 234 ప‌రుగులు చేసింది. భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన డీసీ 8 వికెట్లు కోల్పోయి 205 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఓపెన‌ర్లు ఇషాన్ కిష‌న్, రోహిత్ శ‌ర్మ‌లు ఫోర్లు, సిక్స‌ర్ల మోత మోగించింది. వీరిద్ద‌రూ ముంబైకి మంచి శుభారంభం అందించారు. వీరిద్ద‌రూ 80 ప‌రుగుల భాగాస్వామ్యం నెల‌కోల్పారు. రోహిత్ శ‌ర్మ 27 బంతుల్లో 49 ప‌రుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. మ‌రో ఎండ్ లో ఇషాన్ కిష‌న్ కూడా సూప‌ర్ షాట్ల‌తో అద‌ర‌గొట్టాడు. 23 బంతుల్లో 42 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. వీరికి తోడు టిమ్ డేవిడ్ 45 ప‌రుగులు, షెప‌ర్డ్ 39 ప‌రుగుల దుమ్మురేపే ఇన్నింగ్స్ తో ముంబై ఇండియ‌న్స్ 5 వికెట్లు కోల్పోయి 234 ప‌రుగులు చేసింది.

Latest Videos

భ‌య్యా హాఫ్ సెంచ‌రీ అయినా కొట్ట‌నివ్వ‌చ్చు క‌దా.. !

235 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు మంచి ఆరంభం ల‌భించ‌లేదు. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. మ‌రో ఓపెన‌ర్ పృథ్వీ షా ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో మెరిశాడు. 40 బంతుల్లో 66 ప‌రుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. అభిషేక్ పోరెల్ 41 ప‌రుగుల‌తో స్మ‌ర్ట్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్లేయ‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు.

కానీ, ట్రిస్ట‌న్ ట్ర‌బ్స్ సునామీ ఇన్నింగ్స్ తో ముంబై కొద్ది స‌మ‌యం చెమ‌ట‌లు ప‌ట్టించాడు కానీ, ఢిల్లీకి విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాడు. స్ట‌బ్స్ కేవ‌లం 25 బంతుల్లోనే 284 స్ట్రైక్ రేటుతో 71 ప‌రుగులు కొట్టాడు. త‌న ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాదాడు. 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 8 వికెట్లు కోల్పోయి 205 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీంతో ముంబై ఐపీఎల్ 2024లో తొలి విజ‌యాన్ని అందుకుంది. గెరాల్డ్ 4, బుమ్రా 2 వికెట్లు తీశారు.

విధ్వంసం.. ఒకే ఓవ‌ర్ లో 4,6,6,6,4,6.. ఇన్నిరోజులు ఎక్కడదాచావ్ రొమారియో షెపర్డ్..

 

click me!