Rohit Sharma, Ishan Kishan : ఐపీఎల్ 2024 20వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి శుభారంభం అందించడంతో ముంబై 234 పరుగులు భారీ స్కోర్ చేసింది.
MI vs DC : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ లో 20వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తో అదరగొట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల మోత మోగించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై 20 ఓవర్లలో 234 పరుగుల చేసింది.
హాఫ్ సెంచరీలు మిస్..
undefined
ముంబై ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ బౌండరీతో ముంబై ఇన్నింగ్స్ ను ట్రాక్ లోకి తీసుకువచ్చాడు. వరుస ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. మరో భారీ ఇన్నింగ్స్ వస్తుందనుకుంటున్న సమయంలో ఔట్ అయ్యాడు. అయితే, అప్పటికే హిట్ మ్యాన్ 49 పరుగులు పూర్తి చేశాడు. ఒక్క పరుగు దూరంలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. 49 పరుగుల తన ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
మరో ఎండ్ లో సూపర్ షాట్స్ ఆడుతూ ఇషాన్ కిషన్ కూడా అదరగొట్టాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లను అద్భుతమైన బౌలింగ్ తో బోల్తా కొట్టించింది అక్షర్ పటేల్ కావడం విశేషం. ఇద్దరు ఔట్ అయిన వెంటనే తీవ్రంగా నిరాశను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హాఫ్ సెంచరీ అయినా కోట్టనివ్వరా భయ్యా అంటూ క్రికెట్ లవర్స్, మీమర్స్ కామెంట్లు చేస్తున్నారు.
Brothers of Destruction 🔥🏏 | | | pic.twitter.com/l1n5uyU3OL
— Veer 𝕏 (@Veerunfiltered)విధ్వంసం.. ఒకే ఓవర్ లో 4,6,6,6,4,6.. ఇన్నిరోజులు ఎక్కడదాచావ్ రొమారియో షెపర్డ్.. !