ఢిల్లీ చేతిలో ఓటమి.. కారణం తేల్చి చెప్పిన రోహిత్ శర్మ

Published : Apr 21, 2021, 11:43 AM IST
ఢిల్లీ చేతిలో ఓటమి.. కారణం తేల్చి చెప్పిన రోహిత్ శర్మ

సారాంశం

మిడిల్ ఓవర్లలో తాము బ్యాటింగ్ సరిగా చేయలేకపోయామని.. అందుకే ఓడిపోయామని రోహిత్ పేర్కొన్నాడు. ఆట ఆరంభంలో అదరగొట్టామని.. అయితే దానిని కంటిన్యూ చేయలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ ఓటమి పాలయ్యింది. ముంబయి స్ట్రాంగ్ జట్టు కావడంతో.. విజయం రోహిత్ సేనకే దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా విజయం ఢిల్లీని వరించింది. కాగా.. ఈ మ్యాచ్ ఓడిపోవడం పట్ల ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశ వ్యక్తం చేశాడు.

మిడిల్ ఓవర్లలో తాము బ్యాటింగ్ సరిగా చేయలేకపోయామని.. అందుకే ఓడిపోయామని రోహిత్ పేర్కొన్నాడు. ఆట ఆరంభంలో అదరగొట్టామని.. అయితే దానిని కంటిన్యూ చేయలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. తమ సామర్థ్యం మేరకు ఆడక పోవడం వల్లే తక్కువ స్కోరును నమోదు చేశామన్నాడు  ఒక బ్యాటింగ్‌ యూనిట్‌గా దీన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో రోహిత్‌ వ్యాఖ్యానించాడు.


ఈ మ్యాచ్‌లో క్రెడిట్‌ అంతా ఢిల్లీ బౌలర్లదేనని, చాలా క్లిష్టంగా బౌలింగ్‌ చేసి తమ వికెట్లను రాబట్టారన్నాడు. ఇక్కడ డ్యూ ఉంటుందని తెలుసని, బంతిపై గ్రిప్‌ దొరకనంతగా ఏమీ లేదన్నాడు. ఈ విషయం గత కొన్ని మ్యాచ్‌ల నుంచి చూస్తున్నామని,  ఢిల్లీతో మ్యాచ్‌లో డ్యూ అనేది ఇక్కడ ప్రభావం చూపిందని అనుకోవడం లేదన్నాడు. గెలవాలంటే ఒక మంచి క్రికెట్‌ ఆడాలని, అది ఢిల్లీతో మ్యాచ్‌లో చేయలేకపోయామన్నాడు. 

 శిఖర్‌ ధవన్‌ మాట్లాడుతూ.. ‘ఇది వాంఖడే స్టేడియానికి పూర్తి భిన్నంగా ఉంది. చెన్నైలో గెలవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ముంబై వంటి జట్టుపై గెలవడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ విజయంతో మా కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ బాగా పెరుగుతాయి. మంచి భాగస్వామ్యాలు నమోదు చేయాలనుకున్నాం. మ్యాచ్‌ను ఫినిష్‌ చేసే వరకూ క్రీజ్‌లో నిలబడ లేకపోడంతో నిరాశ చెందా. కానీ మ్యాచ్ విజయంతో ముగించాం. ఈ మ్యాచ్‌లో విజయానికి మేము అన్ని విధాల అర్హులం’ అని పేర్కొన్నాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !