Rohit Sharma: ఇండియన్ టీంలో అలవోకగా సిక్సర్లను బాదే రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. ఎదుటి జట్టులో ఎలాంటి బౌలింగ్ లైనప్ ఉన్నా.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెమటలు పట్టిస్తుంటాడు. ఇక ఐపీఎల్‌లో ఏవిధంగా పరుగుల వరద పారిస్తాడో అందరికీ తెలిసిందే. ఈరోజు జరిగిన ముంబై, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కొత్త రికార్డు సృష్టించాడు.
రోహిత్ శర్మ టీ20ల్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ బ్యాట్స్‌న్‌గా రికార్డు సృస్టించాడు. అది కూడా మన తెలుగు నేలపైన చేరుకోవడం విశేషం. బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై బ్యాటింగ్ చేస్తూ.. 12వ పరుగు సాధించడంతో 12వే పరుగుల మైలు రాయికి చేరుకున్నాడు రోహిత్.. ఈ సందర్బంగా స్టేడియంలోని అభిమానులు చప్పట్లు, కేరింతలు కొట్టి హిట్ మ్యాన్‌కి కంగ్రాట్స్ చెప్పారు.
రోహిత్ శర్మ ఇప్పటి వరకు 456 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 443 ఇన్నింగ్స్‌ల్లో 12,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. సుమారు 17ఏళ్లపాటు టీ20 మ్యాచ్‌లను ఆడుతున్నాడు. ఇప్పటి వరకు టీ20ల్లో 8 సెంచరీలు 79 అర్థ సెంచరీలు చేశాడు. ఇదే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు క్రిస్ గేల్ 14,562 , అలెక్స్ హేల్స్ 13,610, షోయబ్ మాలిక్ 13,571, పొలార్డ్ 13,537, కోహ్లీ 13,208, డేవిడ్ వార్నర్ 13,019, జోస్ బట్లర్ 12,469, ఆ తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు.
ఇక ముఖ్యంగా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలవడం విశేషం.. ఇతని కంటే ముందు విరాట్ కోహ్లీ 8326 పరుగులతో ముందు వరుసలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచ్‌లలో 6,700 పరుగులు చేశాడు. దీని ప్రకారం సగానికిపైగా పరుగులు ఐపీఎల్‌లోనే అతను సాధించాడు. రోహిత్ 265 ఐపీఎల్ మ్యాచ్‌లు 30 సగటుతో ఆడాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో రెండు సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ టైటిల్స్ ముంబయి ఇండియన్స్ జట్టుకి, తన కెప్టెన్సీలో ఒకసారి టీ20 ప్రపంచకప్, మరోసారి ధోని సారథ్యంలో జట్టు సభ్యుడిగా తొలి టీ20 కప్పు సాధించిన జట్టులో రోహిత్ ఉన్నాడు.
టీ20ల్లో కూడా అత్యధిక పరుగులు...
రోహిత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచన తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించాడు. టీ20లో రోహిత్ 4 వేల పరుగులు చేశాడు. 4 వేల క్లబ్‌లో ఉన్న ముగ్గురు క్రికెటర్లలో హిట్ మ్యాన్ ఒకడు. కాగా.. మొదటి స్థానంలో హిట్ మ్యాన్ ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో విరాట్, బాబర్ ఉన్నారు. రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 4,231 పరుగులు ఇప్పటివరకు సాధించి రికార్డు సృష్టించాడు. ఇక టీ20ల్లో కెప్టెన్‌గా 6,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఐదుగురు ఆటగాళ్లలో రోహిత్ ఒకరు. రోహిత్ తర్వాత కోహ్లీ 6,564, ధోని 6,220, డుప్లెసిస్ 6,137, జేమ్స్ విన్స్ ఉన్నారు.