జిమ్‌లో గెంతులు వేసిన రిషబ్ పంత్... కెప్టెన్ ముందు వెయ్యాలన్న వుమెన్ క్రికెటర్...

Published : Jan 06, 2021, 11:18 AM IST
జిమ్‌లో గెంతులు వేసిన రిషబ్ పంత్... కెప్టెన్ ముందు వెయ్యాలన్న వుమెన్ క్రికెటర్...

సారాంశం

మూడో టెస్టు కోసం రెఢీ అవుతున్న రిషబ్ పంత్...  జిమ్‌లో చెమటోడుస్తున్న యంగ్ వికెట్ కీపర్... ఈజీగా మూడు జంప్‌లు చేసిన రిషబ్ పంత్... కెప్టెన్ లేకుంటే ఇంతేనంటూ ఇంగ్లాండ్ వుమెన్ క్రికెటర్ కామెంట్...

రెండో టెస్టులో వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా తనవంతు పాత్రను సమర్థవంతంగానే పోషించాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. వికెట్ల వెనకాల కామెంటరీతో బౌలర్లకు సలహాలు ఇస్తూనే, ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను సెడ్జింగ్ చేశాడు. మూడో టెస్టు కోసం రెఢీ అవుతున్న రిషబ్ పంత్... జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

తాజాగా జిమ్‌ల ఫ్రంట్ ఫ్లిప్ జంప్‌లు చేస్తున్న వీడియోను పోస్టు చేసిన రిషబ్ పంత్... ‘గుడ్ డే అట్ ల్యాబ్’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన ఇంగ్లాండ్ వుమెన్ క్రికెటర్ అలెగ్జాండ్రా హార్ట్‌లీ... ‘కెప్టెన్ లేనప్పుడు కుర్రాళ్లు ఇలాగే ఆడుకుంటారు... విరాట్ కోహ్లీ ఇది చేస్తే చూడాలని ఉంది’ అంటూ కామెంట్ చేసింది.

రిషబ్ పంత్ సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి జరగబోయే మూడో టెస్టులో ఎలా రాణిస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు