DC vs CSK : చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి ఐపీఎల్ 2024లో తొలి విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత ఢిల్లి కెప్టెన్ రిషబ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు.
Rishabh Pant : ఐపీఎల్ 2024 13వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. వైజాగ్ లోని డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ సమయంలో ఓపెనింగ్ జోడీ పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్దారు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ 93 పరుగులు భాగస్వామ్యం నెలకోల్పారు. వార్నర్ భాయ్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 52 పరుగుల తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. మరో ఎండ్ లో ఓపెనర్ పృథ్వీ షా ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ లోనే మెరిశాడు. 159 స్ట్రైక్ రేటుతో 43 పరుగులు చేశాడు.
ఇక దాదాపు ఏడాదికి పైగా క్రికెట్ కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో మళ్లీ ఢిల్లీ కెప్టెన్ గా గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. అంతకుముందు మ్యాచ్ లో మంచి టైమ్ లో బ్యాటింగ్ వచ్చినా పెద్దగా పరుగులు చేయకుండానే ఔట్ కావడంతో తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. అయితే, చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ఒకప్పటి పంత్ లా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 51 పరుగుల తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో రిషబ్ పంత్, ఢిల్లీ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో పంత్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పంత్ కొట్టిన కొన్ని షాట్లు వైరల్ అవుతున్నాయి.
Rishabh Pant departs for a well made 51(32)
Maheesha Pathirana strikes again 🙌
Follow the Match ▶️ https://t.co/8ZttBSkfE8 | pic.twitter.com/ZbifFY0G7F
కాగా, ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. బ్యాటింగ్ లో షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ రాణించారు. ఇక బౌలింగ్ లో ముఖేష్ కుమార్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుచేసింది.
192 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరంభంలోనే చెన్నైకి షాక్ తగిలింది. తొలి ఓవర్ లోనే రుతురాజ్ గైక్వాడ్, 3వ ఓవర్ లో రచిన్ రవీంద్ర రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహానే 45 పరుగులు, డారిల్ మిచెల్ 34 పరుగులు చేశారు. చివరలో ఎంఎస్ ధోని 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు కానీ, చెన్నైకి విజయాన్ని అందించలేకపోయాడు. చెన్నై బౌలర్లలో మతీష పతిరన అద్భుతమైన యార్కర్లతో ఢిల్లీ బ్యాటర్లను హడలెత్తించాడు. మిచెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్, రిషబ్ పంత్ లను పెవిలియన్ కు చేర్చాడు.
Stump lights go 🔛 🚨
✌️breath taking deliveries 😯
Watch the match LIVE on and 💻📱 | | pic.twitter.com/lYfowwYvQd
ధోని షాక్.. చిరుతాల కదిలి పక్షిలా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ క్యాచ్ పట్టిన మతిషా పతిరన