IPL2021: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల గుండె పగిలిన క్షణం.. కన్నీరుమున్నీరైన రిషభ్ పంత్, పృథ్వీ షా

By team teluguFirst Published Oct 14, 2021, 10:44 AM IST
Highlights

IPL2021 DC vs KKR: ఈసారైనా కప్పు కొట్టాలని గంపెడాశలతో ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు నెరవేరలేదు. నిన్న జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఓడిపోయి ఇంటి బాట పట్టింది. దీంతో ఢిల్లీ కుర్రాళ్ల బాధ వర్ణణాతీతంగా మారింది. 

ఐపీఎల్ (IPL2021)లో ఈ ఏడాదైనా కప్పు కొట్టి టోర్నీ విజేతలుగా నిలుద్దామనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు అడియాసలయ్యాయి. రెండో క్వాలిఫైయర్ లో భాగంగా  బుధవారం జరిగిన  మ్యాచ్ లో ఆ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders)చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుని ఇంటి బాట పట్టింది. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన రిషభ్ పంత్ (Rishabh pant) సారథ్యంలోని ఢిల్లీ కుర్రాళ్లు రెండు క్వాలిఫైయర్ మ్యాచులలో తేలిపోయారు. ఇక నిన్నటి మ్యాచ్ లో ఓడిన తర్వాత ఆ జట్టు ఆటగాళ్ల బాధ వర్ణణాతీతం అయింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ (DC) నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఛేదనలో కోల్కతా (KKR) తుదికంటా పోరాడి లక్ష్యాన్ని చేరుకుంది. అయితే మ్యాచ్ ముగిశాక ఢిల్లీ ఆటగాళ్లు కన్నీరుమున్నీరయ్యేలా రోధించారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తో పాటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పృథ్వీ షా (Prithvi shaw), బౌలర్ అవేశ్ ఖాన్ (Avesh Khan)లు కన్నీటి పర్యంతమయ్యారు. 

ఇది కూడా చదవండి: Virat Kohli: కోహ్లి.. నిన్నిలా చూడలేం..! గ్రౌండ్ లో ఏడ్చేసిన విరాట్.. వీడియో వైరల్

ఈ ముగ్గురే గాక ఢిల్లీ ఆటగాళ్ల ముఖాలలో జీవం కనిపించలేదు. లీగ్ దశలో అదరగొట్టిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఈ ప్రదర్శనలతో ఈసారి ఢిల్లీ కప్పు కొట్టడమే తరువాయి అనుకున్నారంతా. కానీ ఎప్పటిలాగే ఢిల్లీ ప్లే ఆఫ్స్ (Playoffs) గండాన్ని దాటలేకపోయింది. కోల్కతా బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠి 9Rahul Tripati) విన్నింగ్ రన్స్ కొట్టగానే ఢిల్లీ ఆటగాళ్ల గుండె పగిలినంత పనైంది. 

 

pic.twitter.com/kWYTtQcNGh

— Prabhat Sharma (@PrabS619)

 

Well played delhi 💔 pic.twitter.com/lV0SEHMmyy

— Ajay maurya (@Ajaymaurya619)

 

Ricky Ponting picks up a heartbroken Rishabh Pant from the dugout, puts an arm around his shoulder and has some words with him. 🤗 pic.twitter.com/HqRu82Imgd

— Smrutiranjan Panda (@Smrutir64331927)

ఒకవైపు గెలిచిన కోల్కతా జట్టు ఆనందోత్సహాల్లో తేలిపోగా.. ఢిల్లీ ఆటగాళ్లు నిర్వేదంలో పడ్డారు. పృథ్వీ షా బాధ తాళలేక మైదానంలోనే కుంగిపోయాడు. పంత్ కంట కన్నీరు ఆగలేదు. బౌండరీ లైన్ వద్ద  ఉన్న అవేశ్ ఖాన్.. వలవల విలపించాడు. సహచరులంతా ఒకరిని ఒకరు ఓదార్చుకున్నా అది కూడా కొద్దిసేపే. ఒకరిని చూసి మరొకరు విలపించారు. ఆటగాళ్లను కోచ్ రికీ పాంటింగ్ తో పాటు ఢిల్లీ సపోర్ట్ స్టాఫ్ ఓదార్చారు. 

ఇది కూడా చదవండి: IPL2021 DC vs KKR: ఈసారి కప్ మాదే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టైటిల్ ఎలా గెలవగలదో చెప్పిన పాంటింగ్

ఇదిలాఉండగా మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడెంత బాధ ఉందని చెప్పలేను. నాకు మాటలు రావడం లేదు. ఎలాగైనా గెలుస్తామనే నమ్మకంతో ఆడాం.  అందుకు తగ్గట్టే మా ఆటగాళ్లు బాగా రాణించారు. కానీ దురదృష్టవశాత్తు మేం విజయం సాధించలేకపోయాం. మేం బ్యాటింగ్ చేసేప్పుడు కోల్కతా బౌలర్లు అద్భుతంగా బంతులేశారు. దీంతో మేం అవసరమైన పరుగులు సాధించలేకపోయాం. అదే మాకు పెద్ద లోటు’ అని అన్నాడు.

click me!