RCBvsKKR: కుప్పకూలిన కేకేఆర్... కోహ్లీసేన ఖాతాలో మరో ఘనవిజయం...

Published : Oct 12, 2020, 11:13 PM ISTUpdated : Oct 12, 2020, 11:22 PM IST
RCBvsKKR: కుప్పకూలిన కేకేఆర్... కోహ్లీసేన ఖాతాలో మరో ఘనవిజయం...

సారాంశం

34 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... మూకుమ్మడిగా ఫెయిల్ అయిన కేకేఆర్ బ్యాటింగ్ లైనప్... అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టిన బెంగళూరు... 112 పరుగులకే పరిమితమైన కేకేఆర్. 82 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఆర్‌సీబీ...

IPL 2020 వరుసగా రెండు మ్యాచుల్లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకుని, రెండు ఘనవిజయాలు అందుకున్న కేకేఆర్, భారీ లక్ష్యచేధనలో చిత్తుగా ఓడింది. 195 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... వరుస వికెట్లు కోల్పోయి చిత్తుగా ఓడింది. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న టామ్ బంటన్ అవుట్ అవ్వడంతో మొదలైన వికెట్ల పతనం... ఆండ్రే రస్సెల్ వికెట్ దాకా కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైన కేకేఆర్, 82 పరుగుల తేడాతో ఆర్‌సీబీకి ఘనవిజయాన్ని అప్పజెప్పింది...

టామ్ బంటన్ 8 పరుగులు చేయగా నితీశ్ రాణా 9, ఇయాన్ మోర్గాన్ 8, దినేశ్ కార్తీక్ 1, ప్యాట్ కమ్మిన్స్ 1 పరుగుకే పెవిలియన్ చేరారు. యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో మంచి టచ్‌లో కనబడ్డాడు. అయితే 34 పరుగులు చేసిన గిల్ రనౌట్ కావడంతో కేకేఆర్ ఇన్నింగ్స్, ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగలేదు.

ఆండ్రే రస్సెల్ వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 16 పరుగులు చేసి, ఆ వెంటనే అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో ఓ బౌండరీతో 16 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. క్రిస్ మోరిస్ 2, వాషింగ్టన్ సుందర్ 2, చాహాల్, సిరాజ్, ఉదన, సైనీ తలా ఓ వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

Abhishek Sharma : అభిషేక్ శర్మ సిక్సర్ల మోత అసలు సీక్రెట్ ఇదే
అయ్యర్ వెర్సస్ తిలక్ వర్మ.. టీ20ల్లో కోహ్లీకి వారసుడు ఎవరు.? ఇప్పుడిదే హాట్ టాపిక్