RCBvsKKR: దంచికొట్టిన ఏబీడీ... రాయల్ ఛాలెంజర్స్ భారీ స్కోరు...

Published : Oct 12, 2020, 09:17 PM ISTUpdated : Oct 12, 2020, 09:21 PM IST
RCBvsKKR: దంచికొట్టిన ఏబీడీ... రాయల్ ఛాలెంజర్స్ భారీ స్కోరు...

సారాంశం

మంచి ఆరంభం ఇచ్చిన దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్... ఏబీ డివిల్లియర్స్ మెరుపు హాఫ్ సెంచరీ... కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ...  

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డివిల్లియర్స్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 23 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేయగా... ఆరోన్ ఫించ్ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఏబీ డివిల్లియర్స్ 73 పరుగులు చేయగా... విరాట్ కోహ్లీ 33 పరుగులు చేశాడు.  23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న ఏబీ డివిల్లియర్స్, 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేయగా... విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క బౌండరీ ఉండడం విశేషం. మూడో వికెట్‌కి ఈ ఇద్దరూ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీశారు.
 

PREV
click me!

Recommended Stories

T20 World Cup Prize Money: వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియాపై కాసుల వర్షం.. మరి టీమిండియాకు ఎన్ని కోట్లొచ్చాయో తెలుసా?
T20 World Cup 2026: మా ప్లాన్ అదే.. ఆసీస్ క్లాస్ టీమ్.. మమ్మల్ని దెబ్బకొట్టారు.. ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఎమోషనల్ కామెంట్స్ !