RCB vs KKR : బెంగ‌ళూరు vs కోల్‌కతా.. ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖాయం.. వీరి ఆట చూడాల్సిందే.. !

By Mahesh Rajamoni  |  First Published Mar 29, 2024, 11:20 AM IST

RCB vs KKR IPL 2024: ఐపీఎల్ 2024 10వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ లో ప‌రుగుల సునామీ రావ‌డం ఖాయం.
 


RCB vs KKR : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ తొలి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. తొలి గేమ్ లో ఓడిన ఆర్సీబీ త‌న రెండో గేమ్ లో పంజాబ్ కింగ్స్ పై అద్భుత పునరాగమనం విజ‌యం సాధించింది. ఇప్పుడు అదే జోరును కొన‌సాగించాల‌ని సిద్ధంగా ఉన్న బెంగ‌ళూరు జ‌ట్టు.. కేకేఆర్ పై మ‌రో గెలుపుతో మెగా టోర్నీలో ముంద‌డుగు వేయాల‌ని చూస్తోంది. రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. 18 మ్యాచ్ ల విజ‌యాల‌తో ఆర్సీబీపై మెరుగైన హెడ్-టు-హెడ్ రికార్డును కలిగి ఉంది.

కేకేఆర్ - ఆర్సీబీ జ‌ట్లు ఇప్పుడు మ‌ళ్లీ బెంగ‌ళూరు లోని చిన్న‌స్వామి స్టేడియంలో త‌ల‌ప‌డ‌నున్నాయి. షార్ట్ బౌండరీలు చిన్నస్వామి ట్రాక్‌ను బ్యాటర్లకు స్వర్గధామంగా మార్చాయి. దీంతో ఇక్క‌డ ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే, ఐపీఎల్ 2024లో 10వ గేమ్ లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయ‌ర్ల లో న‌లుగురి పేర్లు ముందుంటాయి. వీరి ఆట‌ను త‌ప్ప‌క చూడాల్సిందే.. వారిలో.. 

Latest Videos

అదే మా కొంప ముంచింది.. వ‌రుస‌గా రెండో ఓట‌మితో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 

విరాట్ కోహ్లీ

ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పంజాబ్ తో జ‌రిగిన మ్యాచ్ లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు కొట్టాడు. ఈ నాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇక కేకేఆర్ తో జ‌రిగే మ్యాచ్ లో సునీల్ న‌రైన్-విరాట్ కోహ్లీ మ‌ధ్య ఫైట్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది. కేకేఆర్ పై విరాట్ కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ మ‌రో అద్భుత ఇన్నింగ్స్ అద‌ర‌గొట్ట‌డం ఖాయం.

శ్రేయాస్ అయ్యర్

కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చివరి గేమ్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో ఆడాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అయితే, బెంగ‌ళూరు టీమ్ పై శ్రేయాస్ కు మంచి రికార్డు ఉంది. అలాగే, ప్రపంచ కప్ 2023 సందర్భంగా ఎం చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్‌పై అయ్యర్ తన తొలి వ‌న్డే ప్రపంచ కప్ సెంచరీని సాధించాడు. ఇప్పుడు బెంగ‌ళూరులో మ‌రో మంచి ఇన్నింగ్స్ ఆడే అవ‌కాశ‌ముంది.

కామెరాన్ గ్రీన్

ఐపీఎల్ 2024 వేలానికి ముందు మొత్తం నగదు ఒప్పందంలో భాగంగా ముంబై ఇండియ‌న్స్ నుంచి బెంగ‌ళూరు టీమ్ లోకి వ‌చ్చాడు. 24 ఏళ్ల ఈ యంగ్ ప్లేయ‌ర్ ఆర్సీబీ త‌ర‌ఫున త‌న తొలి గేమ్ లో పెద్ద ఇన్నింగ్స్ ను ఆడ‌లేక‌పోయాడు. అయితే, కేకేఆర్ తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్ లో అద‌ర‌గొట్టాల‌ని చూస్తున్నాడు. కామెరాన్ గ్రీన్ మొత్తంగా 18 మ్యాచ్ ల‌ను ఆడి 43 సగటుతో 1 సెంచరీ, 2 అర్ధసెంచరీలతో 473 పరుగులు చేశాడు.

ఆండ్రీ రస్సెల్

వెస్టిండీస్ స్టార్ ప్లేయ‌ర్ చిన్నస్వామి స్టేడియంలో దుమ్మురేప‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఖచ్చితంగా ఆటలో చూడవలసిన ఆటగాళ్లలో ఒకడు. ఈడెన్ గార్డెన్స్‌లో స‌న్ రైజ‌ర్స్ పై 25 బంతుల్లో 3 ఫోర్లు, 7  సిక్స‌ర్ల‌తో 64 పరుగులతో దుమ్మురేపాడు. పేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలాచ‌డు.

చాహ‌ల్ స్పిన్ మాయ‌.. కోపంతో రిగిలిపోయిన రిషబ్ పంత్ ఏం చేశాడో తెలుసా?

click me!