RCBvsDC: ‘మన్కడింగ్’ చేయని అశ్విన్... పాంటింగ్ ఎఫెక్ట్...

By team teluguFirst Published Oct 5, 2020, 10:09 PM IST
Highlights

గత సీజన్‌లో ‘మన్కడింగ్’ విధానం ద్వారా బట్లర్‌ను అవుట్ చేసిన అశ్విన్...

ఈ సీజన్‌లో ఆరోన్ ఫించ్‌కి ‘మన్కడింగ్’ వార్నింగ్...

IPL 2020లో మరోసారి ‘మన్కడింగ్’ చర్చకు తెర తీశాడు రవిచంద్రన్ అశ్విన్. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్‌కి పాల్పడ్డాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్. దూకుడుగా ఆడుతున్న జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. పరుగు తీసేందుకు బాల్ వేయకముందే క్రీజు దాటి ముందుకి వచ్చిన బట్లర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా పెవిలియన్ చేర్చాడు.

అయితే అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారించాడని విమర్శించారు నెటిజన్లు, కొందరు సీనియర్లు. ఏడాది గడిచినా అశ్విన్‌ను ‘మన్కడింగ్’ వివాదం వెంటాడుతూనే ఉంది. తాజాగా 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్‌కు... క్రీజు నుంచి ముందుకొచ్చిన ఆరోన్ ఫించ్‌‌ను ‘మన్కడింగ్’ ద్వారా అవుట్ చేసే అవకాశం వచ్చింది.

అయితే ఈసారి ‘మన్కడింగ్’కి పాల్పడకుండా కేవలం వార్నింగ్ ఇచ్చాడు అశ్విన్. తాను కోచ్‌గా ఉన్నంతవరకూ ఏ ప్లేయర్‌ను మన్కడింగ్‌కి పాల్పడనివ్వనని చెప్పాడు ఢిల్లీ మెంటర్ రికీ పాంటింగ్. పాంటింగ్ కారణంగానే అశ్విన్... ‘మన్కడింగ్’కి పాల్పడకుండా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

click me!