RCBvsDC: మళ్లీ బెంగళూరు చెత్తాట... ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ...

Published : Oct 05, 2020, 11:10 PM IST
RCBvsDC: మళ్లీ బెంగళూరు చెత్తాట... ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ...

సారాంశం

43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... మరోసారి ఘోరంగా విఫలమైన బెంగళూరు బ్యాట్స్‌మెన్... నాలుగు వికెట్లు తీసిన రబాడా...    

IPL 2020 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన ఇస్తుందని ఆశించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి చెత్త ఆటను ప్రదర్శించింది. టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టుకి బ్యాటింగ్ అప్పగించి భారీ మూల్యం చెల్లించుకున్న ఆర్‌సీబీ, లక్ష్యచేధనలో కనీస పోరాటం కూడా చూపించకుండానే చేతులేత్తేసింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ దశలోనూ టార్గెట్‌వైపు సాగలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది ఆర్‌సీబీ.

సీజన్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన దేవ్‌దత్ పడిక్కల్ 4 పరుగులకే పెవిలియన్ చేరగా ఆరోన్ ఫించ్ 13, ఏబీ డివిల్లియర్స్ 9, మొయిన్ ఆలీ 11 పరుగులు చేశారు. 39 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 43 పరుగులు చేసి విరాట్ కోహ్లీని రబాడా అవుట్ చేయడంతో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

వాషింగ్టన్ సుందర్ 17, శివమ్ దూబే 11 పరుగులు, ఉదన 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. ఢిల్లీ బౌలర్లలో రబాడ 4 వికెట్లు తీయగా నోకియా 2, అక్షర్ పటేల్ 2, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !