IPL 2021: విరాట్ కోహ్లిని ఇమిటేట్ చేసిన డివిలియర్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Published : Sep 27, 2021, 05:26 PM IST
IPL 2021: విరాట్ కోహ్లిని ఇమిటేట్ చేసిన డివిలియర్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

IPL 2021 MI vs RCB: ఆదివారం రాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore) టీమ్ ప్లేయర్స్ హోటల్ గదుల్లో తెగ ఎంజాయ్ చేశారు. ఇక విరాట్ కోహ్లి (virat Kohli) స్నేహితుడైన మిస్టర్ ఏబీ (ab de villiers) అయితే ఏకంగా కోహ్లిని ఇమిటేట్ చేసి సహచరులకు ఫన్ పంచాడు. 

ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆ జట్టు బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ ఇద్దరు మంచి మిత్రులు. ఐపీఎల్ వచ్చిందంటే వీళ్ల హంగామా అంతా ఇంతా కాదు. గ్రౌండ్ లో దూకుడుగా ఉండే కోహ్లి.. ఆఫ్ ది ఫీల్డ్ లో మాత్రం జోకులు చేస్తూ సహచరుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకుంటాడు. మిస్టర్ 360 గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే డివిలియర్స్ కూడా కోహ్లితో పాటే ఆహ్లాదంగా కనిపిస్తాడు. 

తాజాగా ముంబయితో మ్యాచ్ గెలిచిన అనంతరం హోటల్ గదులకు చేరుకున్న ఆర్సీబీ సభ్యుల ముందు  మిస్టర్ ఏబీ.. కోహ్లిని ఇమిటేట్ చేశాడు. విజయం సాధించినప్పుడో,   ప్రత్యర్థి జట్టులో కీలక వికెట్ పడ్డప్పుడో విరాట్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆ విజయ సంబురాలనే డివిలియర్స్ అనుకరించాడు. 

 

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో వేలాది లైకులు, షేరులతో దూసుకుపోతున్నది. కాగా, 54 పరుగుల తేడాతో ముంబయిని మట్టికరిపించిన బెంగళూరు జట్టులో ప్రధాన బ్యాట్స్మెన్ గా ఉన్న డివిలియర్స్ రెండో ఫేజ్ మొదలైనప్పట్నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. నిన్నటి మ్యాచ్ లో కూడా అతడు 11 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.  బ్యాటింగ్ లో 56 పరుగులతో చెలరేగిన మ్యాక్స్వెల్.. బంతితోనూ మ్యాజిక్ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

PREV
click me!

Recommended Stories

Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Virat Kohli Marksheet : కోహ్లీకి టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? హయ్యెస్ట్, లోయెస్ట్ ఏ సబ్జెక్టుల్లో?