జిమ్ లో ఉమేశ్ యాదవ్ కసరత్తులు... ఘోరంగా ట్రోల్ చేసిన జడేజా

Published : Jan 09, 2020, 12:18 PM ISTUpdated : Jan 09, 2020, 12:46 PM IST
జిమ్ లో ఉమేశ్ యాదవ్ కసరత్తులు... ఘోరంగా ట్రోల్ చేసిన జడేజా

సారాంశం

త్వరలో జరగనున్న న్యూజిలాండ్ మ్యాచ్ కోసం సిద్ధపడుతున్నాడు. ఈ క్రమంలోనే జిమ్ లో చెమటలు చిందిస్తున్నాడు. తాజాగా... తాను జిమ్ లో చేస్తున్న కసరత్తులకు సంబంధించి ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం తలపడుతోంది. ఒక మ్యాచ్ రద్దు అవ్వగా... రెండో మ్యాచ్ లో కోహ్లీ సేన విజయ ఢంకా మోగించింది. అయితే... శ్రీలంకతో తలపడుతున్న జట్టులో ఉమేశ్ యాదవ్ కి చోటు దక్కలేదు.

దీంతో... విశ్రాంతి దొరకడంతో... త్వరలో జరగనున్న న్యూజిలాండ్ మ్యాచ్ కోసం సిద్ధపడుతున్నాడు. ఈ క్రమంలోనే జిమ్ లో చెమటలు చిందిస్తున్నాడు. తాజాగా... తాను జిమ్ లో చేస్తున్న కసరత్తులకు సంబంధించి ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మీరు కూడా ఇలా బరువులు ఎత్తుతారా బ్రదర్ అంటూ.. క్యాప్షన్ ఇచ్చాడు.

AlsoRead మ్యాచ్ ఓడిపోతామేమోనని అసహనం: దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై బట్లర్ బూతులు...

అయితే... ఆ వీడియోని చూసి మరో క్రికెటర్ రవీంద్ర జడేజా ఘోరంగా ట్రోల్ చేశాడు. ‘‘ ఈ మాత్రం బరువులు అమ్మాయిలైనా ఎత్తుతారు’’ అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ పక్కన నవ్వుతున్న ఎమోజీని కూడా పెట్టాడు. అయితే... జడేజా కామెంట్ కి ఉమేశ్ యాదవ్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.

‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అబీ బాకీ హై మిత్రమా’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది.  నెటిజన్ల నుంచి స్పందన బాగా వస్తోంది.  లైకుల మీద లైకులు కొడుతున్నారు.

ఇదలిా ఉండగా... నెల రోజుల వ్యవధిలోనే టెస్టుల్లో రెండు సెంచరీలు చేసి అందరి దృష్టి ఆకర్షించిన మయాంక్ అగర్వాల్ సైతం జిమ్ లో కసరత్తుల చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 లో బిగ్ ట్విస్ట్.. పాకిస్థాన్ ప్లేస్‌లో ఆ టీమ్ వస్తే రచ్చ రచ్చే !
T20 World Cup 2026 : రూ. 220 కోట్లు గోవిందా.. బంగ్లాదేశ్ కు ఐసీసీ బిగ్ షాక్