జెంటిల్మెన్ క్రీడగా పేరు పొందిన క్రికెట్‌లో పలువురు ఆటగాళ్ల నోటి దురుసు కారణంగా ఎన్నోసార్లు ఆట పరువు రోడ్డున పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ నోటీ దురుసు అంతర్జాతీయ క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. లక్ష్య ఛేదన సందర్భంగా సఫారీ ఆటగాడు వెర్నాన్ ఫిలాండర్ 51 బంతులు ఆడి 8 పరుగులు మాత్రమే చేసి క్రీజులో నిలిచాడు.

Also Read:హర్భజన్ సింగ్ ని కాపీ కొట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

తమ విజయానికి అడ్డుగోడగా నిలిచిన ఫిలాండర్‌ పట్ల ఇంగ్లాండ్ క్రికెటర్లలలో అసహనం పెరిగిపోయింది. ఓ వైపు ఓవర్లు తగ్గిపోతుండటంతో, గెలవాల్సిన మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో బౌలర్ వేసిన బంతిని ఫిలాండర్‌ బ్యాటుతో డిఫెన్స్ చేశాడు. దీనిని అందుకున్న జో రూట్ దానిని కీపర్ జోస్ బట్లర్‌వైపు విసిరాడు. దీనిని గమనించని ఫిలాండర్ వికెట్లకు అడ్డంగా ఉన్నాడు.

Also Read:రోహిత్ శర్మ లేకున్నా....: శ్రీలంకపై విజయం మీద కోహ్లీ స్పందన ఇదీ..

అప్పటికే అసహనంతో ఉన్న జోస్ బట్లర్.. పరుష పదజాలంతో ఫిలాండర్‌ను దూషించాడు. దీనికి బెన్‌స్టోక్స్ సైతం జత కలిశాడు. బయటకు చెప్పలేని పదాలను వాడినట్లుగా తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో క్రికెటర్లు, వ్యాఖ్యాతలు, అభిమానులు ఇంగ్లీష్ క్రికెటర్లను విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. ఈ సంఘటనను తక్కువ చేసి చూపేలా మాట్లాడటం గమనార్హం.