ఐసీసీ నిర్ణయానికి ఇర్ఫాన్ పఠాన్ మద్దతు.. కోహ్లీ, సచిన్ లను విభేదించి మరీ..

By telugu teamFirst Published Jan 8, 2020, 9:48 AM IST
Highlights

 అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను స్వాగతించాడు. కొన్ని సంవత్సరాల క్రితమే తనకీ ఆలోచన వచ్చిందని, ఇప్పుడు దానికి ముందడుగు పడిందని అన్నాడు.
 


ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టులపై టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం అందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రతి ఒక్క క్రికెటర్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండగా.... ఒక్క ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అమోఘం, అద్భుతం అంటూ చెప్పడం తో అందరూ షాకయ్యారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇక నుంచి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ లు పెట్టాలని ఐసీసీ భావిస్తోంది. ఇదే విషయాన్ని  తెలియజేసింది. అయితే...ఈ ఆలోచనపై దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, షోయబ్ అక్తర్, గౌతం గంభీర్ వంటి వారు నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను బాహాటంగానే విమర్శించారు. గౌతం గంభీర్ అయితే ‘అదో చెత్త ఆలోచన’ అని కొట్టి పడేశాడు. 

అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను స్వాగతించాడు. కొన్ని సంవత్సరాల క్రితమే తనకీ ఆలోచన వచ్చిందని, ఇప్పుడు దానికి ముందడుగు పడిందని అన్నాడు.

AlsoRead హర్భజన్ సింగ్ ని కాపీ కొట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్...

రంజీ ట్రోఫీల్లో ఈ ఫార్ములా ఇప్పటికే ఉందని...ప్రతి మ్యాచ్ లోనూ ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నాడు. అలాంటి ఈ ఆలోచచను టెస్టు మ్యాచుల్లో పెడితే తప్పేంటని ప్రశ్నించాడు. ఐసీపీ ప్రతిపాదన తనకు ఎంతో బాగా నచ్చిందని.. తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు వివరించాడు.

ఇదిలా ఉంటే  నాలుగు రోజుల టెస్టుల పేరుతో టెస్టు క్రికెట్‌ను నాశనం చేయొద్దని విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌లు ఇప్పటికే ఐసీసీని కోరారు. ఆ ఆలోచనను పక్కనపెట్టి నాణ్యమైన పిచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇప్పుడు వారికి విరుద్ధంగా ఇర్ఫాన్ మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

click me!