మా ఇంట్లో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది... రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి ట్వీట్...

Published : Apr 30, 2021, 08:56 PM ISTUpdated : Apr 30, 2021, 08:57 PM IST
మా ఇంట్లో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది... రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి ట్వీట్...

సారాంశం

ఆరుగురు పెద్దలతో పాటు నలుగురు పిల్లలకు కరోనా పాజిటివ్... గత వారం ఓ పీడకలలా గడిచిందన్న ప్రీతి నారాయణ్... కుటుంబానికి అండగా ఉండేందుకు ఐపీఎల్ 2021 సీజన్‌కి బ్రేక్ తీసుకున్న అశ్విన్...

ఐపీఎల్ 2021 సీజన్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. కరోనాతో యుద్ధం చేస్తున్న ఈ క్లిష్ట సమయాల్లో కుటుంబానికి అండగా ఉండాలనే, ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు అశ్విన్.

తాజాగా అశ్విన్ భార్య ప్రీతి నారాయణ్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ‘ఒకే వారంలో ఆరుగురు పెద్ద వాళ్లకి, నలుగురు పిల్లలకి కరోనా పాజిటివ్ వచ్చింది. మా పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్లడం వల్ల వైరస్ అంటుకుంది. మా కుటుంబ సభ్యులందరూ వివిధ ఆసుపత్రుల్లో, ఇళ్లల్లో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ వారం ఓ పీడకలలా గడిచింది. ముగ్గురిలో ఒక పేరెంట్ కోలుకుని ఇంటికొచ్చారు... దయచేసిన వాక్సిన్ తీసుకోండి. కరోనాతో యుద్ధం చేయడానికి మనముందున్న ఒకే ఒక్క మార్గం అదొక్కటే’ అంటూ ట్వీట్ చేసింది ప్రీతి. 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !