నిన్న టీమ్‌తో, నేడు ప్రత్యేకంగా... కరోనాతో పోరాటానికి రూ.30 లక్షలు విరాళం ప్రకటించిన జయ్‌దేవ్ ఉనద్కడ్...

Published : Apr 30, 2021, 05:04 PM IST
నిన్న టీమ్‌తో, నేడు ప్రత్యేకంగా... కరోనాతో పోరాటానికి రూ.30 లక్షలు విరాళం ప్రకటించిన జయ్‌దేవ్ ఉనద్కడ్...

సారాంశం

కరోనా రోగుల వైద్య ఖర్చుల కోసం రూ.30 లక్షలు పారితోషికంగా ప్రకటించిన జయ్‌దేవ్ ఉనద్కడ్... నిన్న కరోనా పోరాటానికి సాయంగా మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్... 

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న జయ్‌దేవ్ ఉనద్కడ్, కరోనా పోరాటానికి తనవంతు సాయంగా విరాళం ప్రకటించాడు. తన ఐపీఎల్ పారితోషికంలో 10 శాతం, కరోనా బాధితుల సహాయార్థం విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు జయ్‌దేవ్ ఉనద్కడ్.

ఐపీఎల్ 2018 వేలంలో ఏకంగా రూ.11.50 కోట్లు దక్కించుకున్న జయ్‌దేవ్ ఉనద్కడ్, 2019 వేలంలో రూ.8 కోట్ల 40 లక్షల భారీ మొత్తం దక్కించుకున్నాడు. అయితే అతను పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోవడంతో 2020 వేలంలో రూ.3 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.

 

దీంతో తన పారితోషికంలో 10 శాతం అంటే 30 లక్షల రూపాయాలను కరోనా బాధితుల వైద్య ఖర్చుల కోసం ఇవ్వబోతున్నాడు జయ్‌దేవ్ ఉనద్కడ్. నిన్న కరోనాతో పోరాటినికి ఆటగాళ్లు, యజమానులు, టీమ్ మేనేజ్‌మెంట్ అంతా కలిసి మిలియన్ డాలర్లు సాయం చేస్తున్నట్టు ప్రకటించింది రాజస్థాన్ రాయల్స్...

PREV
click me!

Recommended Stories

IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !
Arshdeep : అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు, 13 బంతులు ! గంభీర్ సీరియస్