
దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా నియంత్రణ కోసం భారత క్రికెటర్లు ఒక్కొక్కరూ ముందుకొస్తున్నారు. సచిన్ టెండూల్కర్ సాయం తర్వాత సన్‌రైజర్స్ ప్లేయర్ శ్రీవాత్సవ, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జయ్‌దేవ్ ఉనద్కడ్ తమ వంతు సాయం చేయగా... ఇప్పుడు ‘గబ్బర్’ శిఖర్ ధావన్ కూడా ఆర్థిక సాయం ప్రకటించాడు.
కరోనా రోగులకు ఆక్సిజన్ సప్లై చేస్తున్న మిషన్ ఆక్సిజన్‌ను తనవంతుగా రూ.20 లక్షల సాయం ప్రకటించిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2021 సీజన్‌లో గెలుచుకునే అవార్డులు, రివార్డుల మొత్తాన్ని కూడా విరాళంగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు.
‘ఆరెంజ్ క్యాప్’ రేసులో టాప్‌లో దూసుకుపోతున్న శిఖర్ ధావన్... కరోనా నియంత్రణలో నిరంతరం శ్రమిస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు థ్యాంక్స్ తెలిపాడు. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని... అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని కోరాడు శిఖర్ ధావన్...