అండర్సన్ దూసుకొచ్చినా ఆష్ అన్నే నెంబర్ వన్ టెస్ట్ బౌలర్.. ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల జోరు

Published : Mar 08, 2023, 08:19 PM IST
అండర్సన్  దూసుకొచ్చినా ఆష్ అన్నే నెంబర్ వన్ టెస్ట్ బౌలర్.. ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల జోరు

సారాంశం

ICC Test Rankings: టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్  రవిచంద్రన్ అశ్విన్  ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో   మరసారి తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ దూసుకొచ్చినా  నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 

భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్  రవిచంద్రన్ అశ్విన్  ఐసీసీ టెస్టు బౌలర్ల జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తున్నాడు.  న్యూజిలాండ్ తో  ఇటివలే  ఇంగ్లాండ్  ఆడిన రెండు టెస్టులలో మెరుగైన ప్రదర్శనలు చేసి  మెరిసిన ఆ జట్టు వెటరన్ పేసర్  జేమ్స్ అండర్సన్.. నెంబర్ వన్ స్థానానికి దూసుకొచ్చినా అశ్విన్  తిరిగి సత్తా చాటాడు.  ఆరు రేటింగ్ పాయింట్స్ కోల్పోయినా  నెంబర్ వన్ బౌలర్ గానే కొనసాగుతున్నాడు. 

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు  ర్యాంకింగ్స్ ల జాబితాలో అశ్విన్.. గత వారంతో పోలిస్తే 6  రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. అశ్విన్, అండర్సన్ కు   సమానంగా 859 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.   అయినా  నెంబర్ వన్ స్థానం మాత్రం  అశ్విన్ కే దక్కడం విశేషం. 

ఈ జాబితాలో కొద్దిరోజుల క్రితం వరకూ నెంబర్ వన్ స్థానంలో ఉన్న  ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్.. 849 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కగిసొ రబాడా  807 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది ఉండగా ఆరోస్థానంలో బుమ్రా, ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నారు.  ఆసీస్ స్పిన్నర్  నాథన్ లియాన్ 9వ స్థానంలో నిలిచాడు.  

ఇక బ్యాటర్ల జాబితాలో  ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్.. 919 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో నిలవగా  స్టీవ్ స్మిత్, జో రూట్, బాబర్ ఆజమ్ లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీమిండియా నుంచి టాప్ - 10 లో రిషభ్ పంత్ మాత్రమే 8వ స్థానంలో ఉన్నాడు. 

 

టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో టీమిండియా సూపర్ స్టార్ రవీంద్ర జడేజా  445 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్  స్థానాన్ని నిలబెట్టుకోగా అశ్విన్.. 363 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. షకిబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్ లో మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా  అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉన్నాడు. 

వన్డే ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటర్లలో బాబర్ ఆజమ్ నెంబర్ వన్ గా కొనసాగుతుండగా  భారత్ నుంచి శుభ్‌మన్ గిల్ (6), విరాట్ కోహ్లీ (7), రోహిత్ శర్మ (9) స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో మహ్మద్ సిరాజ్ నెంబర్ వన్ స్థానాన్ని  నిలబెట్టుకున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో షకిబ్ అల్ హసన్ నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్నాడు. టీ20 ఆల్ రౌండర్ల జాబితాలో కూడా అతడే నెంబర్  వన్ గా కొనసాగుతున్నాడు.  పొట్టి ఫార్మాట్ లో  బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్, బౌలర్లలో వనిందు హసరంగ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

టీ20 ప్రపంచకప్ నుంచి గిల్‌పై వేటుకు ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇవిగో
KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !