
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, అద్భుత సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా, స్ట్రైయిక్ రొటేట్ చేస్తూ చారిత్రాత్మక శతకాన్ని నమోదుచేశాడు.
134 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న రవిచంద్రన్ అశ్విన్‌కి ఇది టెస్టుల్లో ఐదో సెంచరీ... తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాది టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు.
రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో ఐదు వికెట్లు తీసి, సెంచరీ బాదడం ఇది మూడోసారి. 237 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయినప్పుడు 80ల్లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్‌తో కలిసి 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంలో సిరాజ్ చేసింది కేవలం ఒకే ఒక్క పరుగు.