మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్... చాహాల్‌పై చేసిన కామెంట్లపై ఫిర్యాదు...

By team teluguFirst Published Feb 15, 2021, 12:05 PM IST
Highlights

గత ఏడాది జూన్‌లో రోహిత్ శర్మతో లైవ్ సెషన్స్‌లో పాల్గొన్న యువరాజ్...

యజ్వేంద్ర చాహాల్ గురించి ఫన్నీ కామెంట్లు చేసిన యువీ... కులం పేరు వాడడంతో వివాదం...

విమర్శలు రావడంతో అప్పట్లోనే క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్...

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్‌పై గత ఏడాది జూన్‌లో యువీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఓ సామాజిక వర్గం అతనిపై ఫిర్యాదు చేసింది.

హర్యానాలోని హిసార్‌ ఏరియాలో ఉన్న హాన్సీ పోలీస్ స్టేషన్‌లో యువరాజ్‌సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, ఐపీసీ 153, 153A, 295, 505 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

లాక్‌డౌన్ టైమ్‌లో యువరాజ్ సింగ్, క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఈ ఇద్దరి మధ్య క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ గురించి చర్చ వచ్చింది. ఎప్పటిలాగే తనదైన స్టైల్‌లో చాహాల్‌ను ట్రోల్ చేశాడు యువీ.

అయితే ఈ సమయంలో అతను చాహాల్ కులం పేరు వాడడాన్ని ఓ న్యాయవాది, హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అప్పట్లోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ రావడంతో ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని క్షమాపణలు కోరాడు యువరాజ్. అయితే ఇది జరిగిన 9 నెలల తర్వాత అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం విశేషం. 

click me!