టీమిండియా చీఫ్ కోచ్ గా మళ్ళీ రవిశాస్త్రే: కపిల్ దేవ్

By Arun Kumar PFirst Published Aug 16, 2019, 6:27 PM IST
Highlights

రెండు నెలల సస్పెన్స్ కు తెరపడింది. అందరూ అనుకున్నట్లే టీమిండియా చీఫ్ కోచ్ గా మళ్లీ రవిశాస్త్రినే ఎంపికచేస్తూ కపిల్ దేవ్ సారథ్యంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. 

రెండు నెలల సస్పెన్స్ కు తెరపడింది. అందరూ అనుకున్నట్లే టీమిండియా చీఫ్ కోచ్ గా మళ్లీ రవిశాస్త్రినే ఎంపికచేస్తూ కపిల్ దేవ్ సారథ్యంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. 2021 వరకు అతడు ఈ పదవిలో కొనసాగనున్నట్లు కపిల్  దేవ్ పేర్కొన్నాడు. 

శుక్రవారం ఉదయం నుండి చీఫ్ కోచ్ పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల ఇంటర్వ్యూలు కొనసాగాయి. చీఫ్ కోచ్ ఎంపిక ప్రక్రియను చేపడుతున్న సీఏసీ సభ్యులైన కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలు చివరగా పోటీలో నిలిచిన ఆరుగురిని ఇంటర్వ్వూ చేశారు. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రవిశాస్త్రి నే మళ్లీ హెడ్ కోచ్ కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. 

 చీఫ్ కోచ్ పదవికోసం అందిన దరఖాస్తులను పరిశీలించిన సీఏసి అందులోంచి ఓ ఆరుగురిని షార్ట్ లిస్ట్ చేసింది. వీరిలో ప్రస్తుతం మళ్లీ చీఫ్ కోచ్ గా ఎంపికైన రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, మైక్ హెసెన్, ఫిల్ సిమన్స్, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ లు వున్నారు. వీరిని సీఏసీ సభ్యులు పర్సనల్ గా ఇంటర్వ్యూ నిర్వహించారు. అభ్యర్థుల అర్హతలు, అనుభవం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ రవిశాస్త్రినే కొనసాగించాలని తుది నిర్ణయానికి వచ్చారు. దీంతో కపిల్ దేవ్ అధికారికంగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. 

రవిశాస్త్రికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కొంతమంది ఆటగాళ్ల సపోర్ట్ మెండుగా వుంది. అలాగే సీఏసీ సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్ కూడా బహిరంగాగానే రవిశాస్త్రి పనితీరుపై ప్రశంసలు కురిపించాడు. అంటే ఇతడు కూడా పరోక్షంగా అతడి పక్షానే నిలిచాడు. అంతేకాకుండా బిసిసిఐ అధికారులతో కూడా అతడికి  మంచి సంత్సంబంధాలున్నాయి. ఇలా అందరి మద్దతుతో పాటు అతడు చీఫ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన 2017 నుండి టీమిండియా 70శాతం  విజయాలు నమోదుచేసింది. దీంతో టీ 20 ప్రపంచ కప్‌  జరగనున్న 2021 వరకు రవిశాస్త్రినే ప్రధాన కోచ్‌గా కొనసాగించాలని కపిల్ దేవ్  సారథ్యంలోని  సీఏసీ నిర్ణయం  తీసుకుంది. 

click me!