రహానే, పూజారా మళ్లీ ఫ్లాప్! ముంబై ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్... కరణ్ నాయర్ సెంచరీ

Published : Feb 24, 2022, 04:09 PM IST
రహానే, పూజారా మళ్లీ ఫ్లాప్! ముంబై ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్... కరణ్ నాయర్ సెంచరీ

సారాంశం

Ranji Trophy 2022 Updates: గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అజింకా రహానే డకౌట్... ముంబై ఇన్నింగ్స్‌లో ఐదుగురు బౌలర్లు డకౌట్... సెంచరీ బాదిన కర్ణాటక బ్యాటర్ కరణ్ నాయర్...

తొలి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో అదరగొట్టిన భారత సీనియర్ బ్యాటర్, మాజీ వైస్ కెప్టెన్ అజింకా రహానే.. రెండో మ్యాచ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పేలవ ఫామ్‌తో టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయిన అజింకా రహానే, గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు...

తమిళనాడుతో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ముంబై జట్టు, గోవాతో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఆలౌట్ అయ్యింది... కెప్టెన్ పృథ్వీషా 13 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసి మరోసారి నిరాశపరచగా ఆకర్షిత్ గోమల్ 29 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు, ఎస్‌ ఎం యాదవ్ 85 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

అజింకా రహానే 3 బంతులాడి డకౌట్ కాగా ఆదిత్య తారే 8 బంతులాడి పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. శామ్స్ ములానీ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగగా తనుష్ కొటియన్ 38 బంతుల్లో 4  ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు...

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ 110 బంతుల్లో 9 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. సీనియర్ బౌలర్ ధవల్ కుల్‌కర్ణీతో పాటు ప్రశాంత్ సోలంకి కూడా డకౌట్ అయ్యారు. మోహిత్ అవాస్తి 26 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గోవా బౌలర్ లక్షయ్ గార్గ్ 14.4 ఓవర్లలో 3 మెయిడిన్లతో 6 వికెట్లు తీయగా అమిత్ యాదవ్ 17.4 ఓవర్లలో 6 మెయిడిన్లతో 4 వికెట్లు పడగొట్టాడు...

ముంబై ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. జార్ఖండ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జార్ఖండ్ కెప్టెన్ విరాట్ సింగ్ సెంచరీతో చెలరేగాడు. 171 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 103 పరుగులు చేసిన విరాట్ సింగ్ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకి ఆలౌట్ అయ్యింది జార్ఖండ్. నవ్‌దీప్ సైనీ, వికాస్ మిశ్రా మూడేసి వికెట్లు తీయగా లలిత్ యాదవ్, నితీశ్ రాణా రెండేసి వికెట్లు తీశారు...

కర్ణాటక, జమ్మూ కశ్మీర్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కరణ్ నాయర్ సెంచరీతో అదరగొట్టాడు. 184 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 107 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు కరణ్ నాయర్. మనీశ్ పాండే 1 పరుగుకే అవుట్ కాగా దేవ్‌దత్ పడిక్కల్ 8 పరుగులు చేశాడు..

సౌరాష్ట్ర తరుపున బరిలో దిగిన మరో భారత సీనియర్ టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, రెండో టెస్టులో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఒడిస్సాతో జరుగుతున్న మ్యాచ్‌లో దేశాయ్ 38, స్నేహ్ పటేల్ 24 పరుగులు చేసి అవుట్ కాగా వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ 112 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పూజారా 6 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసి పార్థన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !