ఎక్కువ చేస్తున్నాడు, వాడిని పీకేయ్యండి... రాజస్థాన్ రాయల్స్ వేరే లెవెల్ ఫ్రాంక్...

Published : Mar 26, 2022, 03:10 PM IST
ఎక్కువ చేస్తున్నాడు, వాడిని పీకేయ్యండి... రాజస్థాన్ రాయల్స్ వేరే లెవెల్ ఫ్రాంక్...

సారాంశం

రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అడ్మిన్ ప్రవర్తన నచ్చక, కెప్టెన్ సంజూ శాంసన్... అతనిపై టీమ్ మేనేజ్‌మెంట్‌కి ఫిర్యాదు చేశాడంటూ వార్త వైరల్... ఫన్నీ ఫ్రాంక్‌తో ఫ్యాన్స్‌ను అలరించిన రాజస్థాన్... 

ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ స్టేడియంలో ఆడే ఆట మాత్రమే కాదు. వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఇండియన్ ప్రీమియర్ లీగ్... సోషల్ మీడియాలోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే ఏర్పరచుకుంది. ఐపీఎల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ అతి తక్కువ ఉన్న టీమ్‌గా రాజస్థాన్ రాయల్స్‌ను చెప్పుకోవచ్చు...

టీమ్‌పై ఎక్కువ హోప్స్ లేకపోయినా, రాజస్థాన్ రాయల్స్‌కి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం సందర్భానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అకౌంట్ స్పందించే తీరు. ఇన్‌స్టా మీమ్స్‌ను పోలినట్టుగా, ఆర్ఆర్ ట్విట్టర్ ఖాతా నుంచి ఫన్నీ పోస్టులు, ఛలోక్తులతో ఐపీఎల్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత వినోదాన్ని పంచుతూ ఉంటుంది...

కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, ఫన్నీ పోస్టులతో క్రికెట్ ఫ్యాన్స్‌కి కావల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించాడు. జోస్ బట్లర్‌ అంకుల్‌తో ఓపెనింగ్ చేస్తానని పోస్టు చేసిన యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్‌పై కొంటె కామెంట్లతో గర్ల్‌ ఫ్రెండ్‌లా ఆటపట్టించాడు...

తాజాగా రాజస్థాన్ రాయల్స్‌ ట్విట్టర్ అడ్మిన్ తీరు నచ్చకపోవడంతో ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్, అతన్ని తొలగించాలంటూ టీమ్ మేనేజ్‌మెంట్‌కి కంప్లైంట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. తన ఫన్నీ పోస్టులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆర్‌ఆర్ అడ్మిన్‌పై ఎందుకు వేటు వేస్తున్నారో తెలియక అతని ఫ్యాన్స్ ఆందోళన చెందారు...

సోషల్ మీడియా టీమ్‌లో కొన్ని మార్పులు చేస్తున్నామని అధికారిక ప్రకటన కూడా చేసింది రాజస్థాన్ రాయల్స్. అలాగే కొత్త అడ్మిన్ పోస్టు కూడా ఆడిషన్స్ కూడా నిర్వహించింది రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ టీమ్ యజమాని జాక్ లష్ మెక్‌కర్రమ్, టీమ్ మేనేజర్ రోమీ బిందర్ కలిసి యజ్వేంద్ర చాహాల్ పర్యవేక్షణలో ఈ ఆడిషన్స్‌ని నిర్వహించారు.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు రియాన్ పరాగ్, యజ్వేంద్ర చాహాల్, టీమ్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్ (యాగి)లతో పాటు వెస్టిండీస్ క్రికెటర్ ఓబెడ్ మెక్‌కాయ్ ఈ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. చాహాల్ తనదైన స్టైల్‌లో వినోదాన్ని పంచగా... ఓబెడ్ మెక్‌కాయ్ సైలెంట్‌గా బిత్తెర చూపులు చూస్తూ, నవ్వులు పూయించాడు... సిమ్రాన్ హెట్మయర్, నా జట్టు రంగు ఎల్లో కలర్‌లో ఉందని మాటిమాటికి చెబుతూ, ఇంటర్వ్యూ చేసేవారి దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నించాడు.. 

ఇదంతా ఆర్ఆర్ అడ్మిన్ దర్శకత్వంలో జరిగిన ఫ్రాంక్ అని తెలిసి, అతని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అడ్మిన్ ఆడిషన్స్‌ పేరుతో నిర్వహించిన ఫేక్ ఆడిషన్స్ వీడియో, రాజస్థాన్ రాయల్స్‌ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో నిలబెట్టేలా చేసింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఏడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఈ ఏడాది మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో భాగంగా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్‌లను అట్టిపెట్టుకున్న సంజూ శాంసన్... మెగా వేలంలో కరణ్ నాయర్, సిమ్రాన్ హెట్మయర్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్, నాథన్ కౌంటర్‌నైల్, జిమ్మీ నీశమ్, డార్ల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, నవ్‌దీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్డ్ వంటి స్టార్లను కొనుగోలు చేసింది...

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?