కన్నడ టీచర్ గా మారిన రాహుల్ ద్రవిడ్..!

Published : Aug 09, 2021, 01:15 PM IST
కన్నడ టీచర్ గా మారిన రాహుల్ ద్రవిడ్..!

సారాంశం

రాహుల్ ద్రవిడ్ కన్నడ టీచర్ గా మారారు. ఈ టెస్టు సిరీస్  నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ కు రాహుల్ ద్రవిడ్.. కన్నడ నేర్పించడం గమనార్హం.

టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. కాగా.. ఇప్పుడు తాజాగా ఆయన  కన్నడ టీచర్ గా కూడా మారారు. శ్రీలంకతో ఇటీవల టీమిండియా యువ క్రికెటర్లు టీ20 సిరీస్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ ని మనవాళ్లే కైవసం చేసుకున్నారు. వారి విజయానికి కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పూర్తిగా సహకరించారు. కోచ్ గా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారు.

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం తలపడుతోంది. ఈ నేపథ్యంలో.. రాహుల్ ద్రవిడ్ కన్నడ టీచర్ గా మారారు. ఈ టెస్టు సిరీస్  నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ కు రాహుల్ ద్రవిడ్.. కన్నడ నేర్పించడం గమనార్హం.

దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.ఆ వీడియోలో కన్నడ నేర్పించడం.. దానికి సంబంధించిన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం గమనార్హం. క్రికెట్ ని కన్నడ భాషలో నేర్పిస్తుండటం విశేషం. ఒక పరుగును కన్నడలో బేగా ఓడి అని చెప్పాలని రాహుల్ ద్రవిడ్ నేర్పించడం విశేషం. కావాలంటే.. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే