రాహుల్ ద్రవిడ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? బయటపెట్టిన విరాట్ కోహ్లీ

By telugu news teamFirst Published Apr 10, 2021, 9:00 AM IST
Highlights

దీనిలో భాగంగా ద్రవిడ్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడు. అర్జెంట్ పని ఉండటం.. ట్రాఫిక్ ఎంతసేపటికీ  కదలకపోవడంతో.. చాలా ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. 

ఇండియన్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ గురించి తెలియని వారు ఉండరేమో.. క్రికెట్ గురించి అవగాహన ఉన్న చిన్న పిల్లాడిని అడిగినా ఆయన గురించి చెప్పేస్తాడు. అయితే.. ఆయనలోని ఓ కొత్త కోణాన్ని ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బయటపెట్టాడు. రాహుల్ ద్రవిడ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ద్రవిడ్ తన కోపాన్ని తానే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని కోహ్లీ షేర్ చేయగా.. వీడియో వైరల్ గా మారింది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. సెలబ్రెటీలు ఏదో ఒక ప్రముఖ యాడ్ లో కనిపించడం సర్వ సాధారణం. తాజాగా ద్రవిడ్ కూడా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ యాప్ కి సంబంధించిన ఓ యాడ్ లో నటించారు. దీనిలో భాగంగా ద్రవిడ్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడు. అర్జెంట్ పని ఉండటం.. ట్రాఫిక్ ఎంతసేపటికీ  కదలకపోవడంతో.. చాలా ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. 

 

Never seen this side of Rahul bhai 🤯🤣 pic.twitter.com/4W93p0Gk7m

— Virat Kohli (@imVkohli)

పదే పదే స్టీరింగ్ నొక్కుతూ కనిపిస్తాడు. చుట్టుపక్కల వారిని చూసి కూడా బాగా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. చేతిలో బ్యాట్ పట్టుకొని.. కొందరి కార్ల అద్దాలు కూడా పగలకొట్టేస్తాడు. ఆ తర్వాత కారు రూఫ్ టాప్ నుంచి పైకి నిలపడి తాను ఇందిరానగర్ కి డాన్ అంటూ గట్టిగా అరుస్తూ కనిపించాడు. ఇదంతా క్రెడిట్ కార్డ్ యాప్ కి సంబంధించిన  యాడ్. కాగా.. ఈ యాడ్ ని కోహ్లీ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.

రాహుల్ భయ్యాలో ఈ యాంగిల్ నేను ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్ పెట్టడం విశేషం. దీంతో.. ఈ యాడ్ అందరి కళ్లల్లో పడింది.

click me!