గేల్ ఈజ్ బ్యాక్... అదరగొట్టేశాడు.. వీడియో వైరల్

Published : Apr 10, 2021, 08:31 AM ISTUpdated : Apr 10, 2021, 08:39 AM IST
గేల్ ఈజ్ బ్యాక్... అదరగొట్టేశాడు.. వీడియో వైరల్

సారాంశం

క్రిస్ గేల్ కి సంబంధించిన వీడియోని పంజాబ్ కింగ్స్ తమ అఫీషియల్ పేజీలో షేర్ చేసింది. అందులో.. గేల్.. డోలు వాయిస్తూ అదరగొట్టాడు. ఈ వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లో నే వైరల్ గా మారింది.  

క్రిస్ గేల్... పరిచయం అక్కర్లేని పేరు. ఈ జమైకా డాషర్ స్టేడియంలోనే మాత్రమే కాదు... మైదానంలో లేకపోయినా ఎప్పుడూ స్పాట్ లైట్ లోనే ఉంటాడు. రెండు రోజుల క్రితం మైకేల్ జాక్సన్ లాగా.. డ్యాన్స్ వేసి.. అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా... క్రిస్ గేల్ ఈ ఐపీఎల్ లో సందడి చేయనున్న విషయం తాజాగా పంజాబ్ కింగ్స్ జట్టు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో... క్రిస్ గేల్ కి సంబంధించిన వీడియోని పంజాబ్ కింగ్స్ తమ అఫీషియల్ పేజీలో షేర్ చేసింది. అందులో.. గేల్.. డోలు వాయిస్తూ అదరగొట్టాడు. ఈ వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లో నే వైరల్ గా మారింది.

 

వేలల్లో లైకులు వచ్చి పడ్డాయి. కేవలం గంటకే 18వేల లైకులు ఈ వీడియోకి రావడం గమనార్హం. ఈ యూనివర్శల్ బాస్.. మళ్లీ ఐపీఎల్ లో అడుగుపెట్టాడు అనే విషయం తెలిసి అభిమానులు ఆనందం తట్టుకోలేకపోయారు. తమ ఆనందాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

ఇటీవల గేల్ తన ఏడురోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో అందరూ క్వారంటైన్ పూర్తిచేసుకోవాల్సిందే. ఈ సందర్భంగా అదిరిపోయిన స్టెప్పులతో యూనివర్సల్‌ బాస్‌ అలరించాడు. క్వారంటైన్‌ పూర్తైన ఆనందంలో గేల్‌.. మైఖేల్‌ జాక్సన్‌ సూపర్‌ హిట్‌ "మూన్‌ వాక్‌" సాంగ్‌కు డ్యాన్స్‌ చేశాడు. బాస్ చిందేస్తుండగా తీసిన వీడియోను పంజాబ్‌ కింగ్స్‌ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. "క్వారంటైన్‌ పూర్తయింది. మీ ఫేవరేట్ గేల్ బయటికి వచ్చాడు" అని పంజాబ్‌ ట్వీట్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు