వీడిన సస్పెన్స్, టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ...

By Chinthakindhi RamuFirst Published Oct 16, 2021, 9:20 AM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత జరిగే న్యూజిలాండ్ సిరీస్ నుంచి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్న రాహుల్ ద్రావిడ్... బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ బౌలర్ పరాస్ మాంబ్రే... 

టీమిండియా తర్వాతి కోచ్‌ ఎవరనేదానిపై కొనసాగిన ఉత్కంఠకి తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం భారత జట్టు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు, టీ20 వరల్డ్‌కప్‌తో ముగియనున్న విషయం తెలిసిందే...

టీ20 వరల్డ్‌కప్ తర్వాత జరిగే న్యూజిలాండ్ సిరీస నుంచి హెడ‌కోచ్‌గా బాధ్యతలు తీసుకునే రాహుల్ ద్రావిడ్, 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్, ఆ పదవికి రాజీనామా సమర్పించబోతున్నారు. 

అలాగే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవీ కాలం కూడా ముగియనుండడంతో అతని స్థానంలో భారత మాజీ బౌలర్ పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు... ఎన్‌సీఏలో రాహుల్ ద్రావిడ్‌తో పాటు పరాస్ మాంబ్రే బౌలింగ్ శిక్షకుడిగా కొనసాగుతున్నారు.

ఈ ఇద్దరూ త్వరలోనే ఎన్‌సీఏలో తమ పొజిషన్లకు రాజీనామా సమర్పించనున్నారని బీసీసీఐ అధికారిక ప్రకటన ద్వారా తెలియచేసింది.ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ స్థానంలో ఎవరిని తీసుకుంటున్నారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం తన పదవిలో కొనసాగబోతున్నాడు...

రెండేళ్ల కాంట్రాక్ట్‌లో భాగంగా రాహుల్ ద్రావిడ్ రూ.10 కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నారు. ‘గత నెలలో ఎన్‌సీఏ డైరెక్టర్‌గా రాహుల్ ద్రావిడ్ తిరిగి బాధ్యతలు తీసుకున్నారు. అయితే రవిశాస్త్రి తర్వాత భారత జట్టును అంతే విజయవంతంగా నడిపించే కోచ్ కావాలని బీసీసీఐ భావించింది.

ఆ బాధ్యతను తీసుకోవడానికి రాహుల్ ద్రావిడ్‌కి మించిన బెటర్ ప్లేయర్ కనిపించలేదు... అందుకే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షా కలిసి ద్రావిడ్‌ను హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పించారు...’ అని తెలిపారు బీసీసీఐ అధికారి...

ఇదీ చదవండి: IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా... IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...
click me!