Rohit emotional farewell for Rahul Dravid : టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ద్రవిడ్ మ్యాన్-మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు, ప్లేయర్లతో నడుచుకునే తీరు.. వినయాన్ని ప్రశంసించాడు. తన కెరీర్, వ్యక్తిగత ఎదుగుదలపై ద్రావిడ్ చూపిన ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు.
Rohit emotional farewell for Rahul Dravid : 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాహుల్ ద్రవిడ్ కోచింగ్, రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా మరో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఫార్మాట్ లో రెండో టైటిల్ ను సాధించింది. ఈ స్టార్ ద్వయం అందించిన ఆనంద క్షణాలు క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతాయి. అయితే, టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు.
ఈ ప్రపంచ కప్ తో టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది. ఈ క్రమంలోనే ద్రవిడ్ తో ఉన్న అనుబంధం గురించి రోహిత్ శర్మ ఎమోషనల్ నోట్ రాశారు. రాహుల్ ద్రవిడ్‌కు హృదయపూర్వక వీడ్కోలు పలుకుతూ.. సోషల్ మీడియా వేదికగా తన భావోద్వేగా స్పందనను తెలిపాడు. "రాహుల్ ద్రవిడ్.. రాహుల్ భాయ్ నా కోచ్..నా నమ్మకం.. నా స్నేహితుడు" అంటూ ఎమోషనల్ అయ్యారు. "ప్రియమైన రాహుల్ భాయ్.. నా భావాలను సరిగ్గా వ్యక్తీకరించడానికి నేను సరైన పదాల కోసం వెతుకుతున్నాను.. కానీ నేను ఎప్పటికీ చేస్తానని నాకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఇదిగో నా ప్రయత్నం. నా చిన్ననాటి నుండి నేను కోట్లాది మంది ఇతరులలాగే నిన్ను చూస్తున్నాను.. అలాంటిది మీతో కలిసి సన్నిహితంగా పని చేయడం నేను చాలా అదృష్టవంతుడిని" అని రోహిత్ శర్మ పేర్కొన్నారు.
విరాట్ కోహ్లి రెస్టారెంట్‌పై కేసు నమోదు.. ఏం జరిగింది?
ద్రవిడ్ తన స్టార్ డమ్ ను డ్రెస్సింగ్ రూమ్ వెలుపలే వదిలిపెట్టి టీమిండియా కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. క్రికెట్ లో తాను సాధించిన విజయాల గర్వంతో కాకుండా తాజా మనస్సుతో కోచింగ్ పాత్రలోకి అడుగుపెట్టాడనీ, తమను ఎంతగానో ప్రభావితం చేశారని అన్నాడు. “మీరు ఈ గేమ్‌కు సంపూర్ణమైన ప్రతిభావంతులు, కానీ మీరు మీ ప్రశంసలు.. మీ విజయాలు అన్నింటినీ డ్రెస్సింగ్ రూమ్ తలుపు వద్ద వదిలి మా కోచ్‌గా నడిచారు.. మమ్మల్ని నడిపించారు.. మీతో ఏదైనా చెప్పడానికి మేమంతా సంకోచం లేకుండా ఉన్నామంటే.. మీరు ఆటగాళ్లతో ఎలా నడుచుకుంటారనే విషయాలను స్పష్టం చేస్తుంది. ఇది మీ బహుమతి, మీ వినయం.. ఇంతకాలం తర్వాత కూడా ఈ ఆట పట్ల మీకున్న ప్రేమ చాలా గొప్పది. నేను మీ నుండి చాలా నేర్చుకున్నాను.. ప్రతి జ్ఞాపకం ఎంతో విలువైనది. నా భార్య నిన్ను నా పని భార్యగా పిలుస్తుంది. అంత సన్నిహితతో కూడా పిలవడం నా అదృష్టం" అని రోహిత్ పేర్కొన్నాడు.
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ముందున్న సవాళ్లు ఏమిటి?