
పృథ్వీ షా... అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌గా టీమిండియాలోకి దూసుకొచ్చిన యంగ్ సెన్సేషన్. ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ బాదిన పృథ్వీ షా.. టీమిండియా తరుపున 5 టెస్టులు ఆడి 339 పరుగులు చేశాడు... టెస్టుల్లో 42.37 సగటుతో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేసిన పృథ్వీ షా... 2020-21 ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టు తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయాడు...
పృథ్వీ షాని సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా కలగలిసిన టాలెంటెడ్ కిడ్‌ని అభివర్ణించాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. అయితే శాస్త్రి హయాంలో టీమ్‌లో చోటు కోల్పోయిన పృథ్వీ షా, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకుని ఏడాది గడచినా టీమ్‌లోకి రాలేకపోతున్నాడు...
గాయాలతో, నిషేధిత ఉత్ప్రేరకాలు వాడడంతో కొన్నాళ్లు జట్టుకి దూరమైన పృథ్వీ షాకి వన్డే, టెస్టు టీమ్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశవాళీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్‌లు ఇస్తున్న పృథ్వీ షా, రంజీ ట్రోఫీ 2023 ట్రోఫీలో డబుల్ సెంచరీ బాదాడు...
అస్పాంతో జరుగుతున్న మ్యాచ్‌లో 240 పరుగులతో అజేయంగా నిలిచి తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు పృథ్వీ షా. ఇంతకుముందు 2019లో బరోడాపై 202 పరుగులు చేసి అవుట్ అయ్యాడు పృథ్వీ షా. ఆ స్కోరుని దాటేసిన పృథ్వీ షా..
107 బంతుల్లో సెంచరీ, 164 బంతుల్లో 150 పరుగులు, 235 బంతుల్లో డబుల్ సెంచరీ బాదాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది ముంబై జట్టు. 283 బంతులు ఆడి 33 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 240 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు పృథ్వీ షా..
ముషీర్ ఖాన్ 72 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి అవుట్ కాగా అర్మాన్ జాఫర్ 48 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. టీమిండియా క్రికెటర్, ముంబై కెప్టెన్ అజింకా రహానే 140 బంతుల్లో 5 ఫోర్లతో 73 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. పృథ్వీ షా, అజింకా రహానే కలిసి మూడో వికెట్‌కి అజేయంగా 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు చెత్తాట కొనసాగుతూనే ఉంది. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 30.5 ఓవర్లలో 79 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
23 పరుగులు చేసిన రోహిత్ రాయుడు టాప్ స్కోరర్‌గా నిలవగా భగత్ వర్మ 11, అనికెత్ రెడ్డి 10 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. సౌరాష్ట్ర కెప్టెన్ జయ్‌దేవ్ ఉనద్కట్, ధర్మేంద్రసిన్హ్ జడేజా మూడేసి వికెట్లు తీయగా యువరాజ్ సిన్హ్ దోహియా 2 వికెట్లు