INDvsSL 1st ODI: టాస్ గెలిచిన శ్రీలంక... ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి...

By Chinthakindhi RamuFirst Published Jan 10, 2023, 1:05 PM IST
Highlights

India vs Sri Lanka 1st ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక కెప్టెన్ దసున్ శనక.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే అందరి దృష్టి.. 

టీమిండియాతో జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ద్వారా దిల్షాన్ మదుశంక వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు.  హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. వన్డే సిరీస్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండడంతో ఈ మ్యాచ్‌లకు మంచి క్రేజ్ ఏర్పడింది...

మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసి, రికార్డు క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. గత ఏడాది వన్డేల్లో చెప్పుకదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. 2022లో టీ20ల్లో 1100లకు పైగా పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన ఇచ్చాడు...

ఇదే సమయంలో శ్రేయాస్ అయ్యర్ వన్డేల్లో నిలకడైన ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఈ ఇద్దరూ ఎవరు ఆడాలనేది ఈ వన్డే సిరీస్ నుంచే తేలిపోనుంది. టీ20ల్లో అదరగొడుతూ వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్ యాదవ్, వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఈ సిరీస్ నుంచే సత్తా చాటాల్సి ఉంటుంది... టీ20 సిరీస్‌లో అలిసిపోయిన సూర్యకుమార్ యాదవ్‌కి తొలి వన్డే నుంచి విశ్రాంతి కల్పించిన టీమిండియా మేనేజ్‌మెంట్, శ్రేయాస్ అయ్యర్‌కి తుది జట్టులో చోటు కల్పించింది.

టీమిండియా, బంగ్లాదేశ్‌తో ఆడిన ఆఖరి వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాది వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసేశాడు. అయితే గత ఏడాదిగా వన్డేల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్న శుబ్‌మన్ గిల్ కోసం ఇషాన్ కిషన్‌ని పక్కనబెట్టేసింది టీమిండియా..  రోహిత్ శర్మతో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయబోతున్నాడు...

కెఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించబోతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహాల్ స్పిన్నర్లుగా తుది జట్టులో చోటు దక్కించుకోగా సీనియర్లు మహ్మద్ షమీతో కలిసి ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్‌ని పంచుకోబోతున్నారు... 

బంగ్లాతో జరిగిన ఆఖరి వన్డేలో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీతో పాటు ఈ ఏడాది మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మకి కూడా గౌహతిలో మంచి రికార్డు ఉంది. దీంతో ఈ ఇద్దరూ నేటి మ్యాచ్‌లో సెంచరీలు చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు.. 

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహాల్

శ్రీలంక జట్టు: పథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వ, చరిత్ అసలంక, దసున్ శనక, వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, కసున్ రజిత, దిల్షాన్ మదుశంక 

click me!