మోనోపోలీ, తన హృదయ విజేతను ప్రకటించిన అనుష్క

Published : Apr 09, 2020, 08:33 AM IST
మోనోపోలీ,  తన హృదయ విజేతను ప్రకటించిన అనుష్క

సారాంశం

ఒక దాంట్లో అనుష్క.. కోహ్లీ జుట్టుకూడా కత్తిరించింది. కాగా... తాజాగా.. వీరు మోనోపోలీ గేమ్ ఆడారు. దానికి సంబంధించిన ఫోటోలను అనుష్క తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కంటే ముందే తన సతీమణి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మతో తన ప్రత్యేక ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఈ ప్రేమ‌ప‌క్షులు ఇప్ప‌డు ఇంట్లోనే ఆనందంగా  గ‌డుపుతున్నారు. వీలుచిక్కినప్పుడల్లా సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లోకి వస్తున్నారు.

Also Read హాఫ్ కరోనా ట్రోల్స్... గుత్తా జ్వాల స్ట్రాంగ్ కౌంటర్...

ఇటీవల వారికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలను విరుష్క జోడీ అభిమానులతో పంచుకున్నారు. ఒక దాంట్లో అనుష్క.. కోహ్లీ జుట్టుకూడా కత్తిరించింది. కాగా... తాజాగా.. వీరు మోనోపోలీ గేమ్ ఆడారు. దానికి సంబంధించిన ఫోటోలను అనుష్క తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

ఈ ఆటలో విరుష్క జోడీతో పాటు.. అనుష్క శర్మ పేరెంట్స్ కూడా పాలుపంచుకోవడం విశేషం. చాలా రసవత్తరంగా సాగిన ఆటకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. కాగా.. ఈ ఆటలో ఎవరు గెలిచారో తెలుసా అంటూ.. అనుష్క అభిమానులను ప్రశ్నించారు.

కాగా.. తాజాగా.. మోనోపోలీ, తన హృదయాన్ని గెలిచింది ఇతనే అంటూ విరాట్ కోహ్లీ ఫోటోని అనుష్క శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోని తన స్టేటస్ లో పెట్టుకుంది. ఆ ఫోటోలో కోహ్లీ తలపై ఓ కిరీటాన్ని కూడా ఉంచడం విశేషం. ఫోటోలో  కోహ్లీ ఫన్నీ ఎక్స్ ప్రెషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు 2017 డిసెంబర్ లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ నాటి నుంచి వారు వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుంటూ వచ్చారు. నిజానికి ఈ సమయంలోనూ కోహ్లీ ఐపీఎల్ తో బిజీగా ఉండాల్సి ఉంది. కానీ.. కరోనా లాక్ డౌన్ అంతా రివర్స్ అయిపోయింది. దీంతో.. ఈ జంట తమ లాక్ డౌన్ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది