
Uppal Stadium - IPL 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) vs చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య ఐపీఎల్ 2024 18వ మ్యాచ్ పై చీకట్లు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరుగుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకుంటే ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ అయింది. దీంతో అక్కడి పరిసరాలు చీకట్లలో నిండిపోయాయి. హైదరాబాద్ vs చెన్నై మ్యాచ్ జరగబోయే ఒక రోజు ముందు ఈ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. స్టేడియంకు సంబంధించి కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో పవర్ కట్ చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎస్‌ఆర్‌హెచ్-సీఎస్కే మ్యాచ్‌కు ముందు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిఎస్‌ఎస్‌పిడిసిఎల్) గురువారం ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. రూ. 1.63 కోట్ల విద్యుత్ బకాయిలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారులు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామనీ, అందుకే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారి ధ్రువీకరించారు.
రావడం రావడమే ఉతికిపారేస్తున్నారు.. ఇదెక్కడి ఆటరా నాయనా.. !
టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ హబ్సిగూడ సర్కిల్ స్టేడియంకు విద్యుత్ సరఫరాను నిలిపివేసి, బకాయిలు చెల్లించిన తర్వాత మాత్రమే పునరుద్ధరించబడుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఇప్పటికే తెలియజేసింది. ఫిబ్రవరి 22 కూడా విద్యుత్ అధికారులు బకాయిలను చెల్లించాలని కోరుతూ హెచ్సీఏకు లేక రాశారు. 15 రోజుల వ్యవధిలో (నోటీస్‌కు బదులుగా) మొత్తం చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు స్టేడియంకు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. బకాయిలు చెల్లించనందుకు 2021లో కూడా ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే, SRH vs CSK మ్యాచ్ శుక్రవారం రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో పవర్ కట్ కావడంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
'గిల్' మాంగే మోర్.. బౌండరీల వర్షం.. ఏం షాట్స్ గురూ.. అదిరిపోయింది !