'గిల్' మాంగే మోర్.. బౌండ‌రీల వ‌ర్షం.. ఏం షాట్స్ గురూ.. అదిరిపోయింది !

GT vs PBKS : ఐపీఎల్ 2024లో 17వ సీజన్‌లో తన మొదటి హాఫ్ సెంచరీని చేరుకోవడానికి స్టార్ ప్లేయ‌ర్ శుభ్‌మన్ గిల్ 190.48 స్ట్రైక్ రేట్‌తో 5 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడు. గిల్ మాంగే మోర్ అనేలా అద్భుతమైన షాట్లతో సూప‌ర్ ఇన్నింగ్ ఆడాడు. 
 

Gill Mange more.. Shubman Gill's super innings, Record for highest individual score in IPL 2024 GT vs PBKS

Gujarat Titans vs Punjab Kings : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ లో 17వ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు.  ఈ సీజ‌న్ లో ఒక మ్యాచ్ లో టాప్ స్కోర్ సాధించిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ టీమ్ బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ జ‌ట్టు ప్రారంభంలో త‌డ‌బ‌డింది కానీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కుదురుకున్న త‌ర్వాత సూప‌ర్ షాట్ల‌తో పంజాబ్ బౌలింగ్ ను చిత్తుచేశాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టాడు.

ఐపీఎల్ 2024లో 17వ సీజన్‌లో తన మొదటి హాఫ్ సెంచరీని చేరుకోవడానికి శుభ్‌మన్ గిల్ 190.48 స్ట్రైక్ రేట్‌తో 5 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడు. గిల్ మాంగే మోర్ అనేలా ఆ త‌ర్వాత ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ సూప‌ర్ ఇన్నింగ్ ఆడాడు. ఓపెన‌ర్ గా వ‌చ్చిన గిల్.. 48 బంతుల్లో 89 ప‌రుగులతో అజేయంగా నిలిచాడు. త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు. గిల్ 48 ప‌రుగుల వ‌ద్ద ఉన్నప్పుడు హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి త‌న‌దైన స్టైల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. గిల్ త‌న ఇన్నింగ్స్ లో అద్భుతమైన షాట్స్ ఆడాడు. ఈ సీజ‌న్ లో ఇప్పటివ‌ర‌కు అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ చేసిన ప్లేయ‌ర్ గా గిల్ నిలిచాడు.

ఐపీఎల్ 2024లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ చేసిన ప్లేయ‌ర్లు

87* శుభ్ మ‌న్ గిల్ vs పంజాబ్ కింగ్, అహ్మదాబాద్
85 సునీల్ నరైన్ vs ఢిల్లీ క్యాపిట‌ల్స్, వైజాగ్
84* రియాన్ పరాగ్ vs ఢిల్లీ క్యాపిట‌ల్స్, జైపూర్
83* విరాట్ కోహ్లీ vs కేకేఆర్, బెంగళూరు
82*  సంజూ శాంసన్ vs ల‌క్నో , జైపూర్ 

గిల్ 87* ప‌రుగుల ఇన్నింగ్స్ తో గుజ‌రాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 200 ప‌రుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. ఓపెనర్ సాహా 11 పరుగులు మాత్రమే చేసి క‌గిసో రబాడ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కేన్ విలియమ్సన్ 26 పరుగులు, సాయి సుదర్శన్ 33 పరుగులు చేశాడు. చివరలో రాహుల్ తెవాటియా ధనాధన్ ఇన్నింగ్స్ తో మెరుపులు మెరిపించాడు. 8 బంతుల్లోనే 23 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, ఒక సిక్సరు బాదాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో కసిగో రబాడ 2 వికెట్లు తీసుకున్నాడు. హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్ లు చెరో వికెట్ పడగొట్టారు.

రావడం రావడమే ఉతికిపారేస్తున్నారు.. ఇదెక్కడి ఆటరా నాయనా.. !

 త‌న‌ను కింద‌ప‌డేసిన ఇషాంత్ శ‌ర్మ‌ను మెచ్చుకున్న ఆండ్రీ రస్సెల్ ! నువ్వు గ్రేట్ సామి..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios