
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్ లీగ్ లలో తిరుగులేని మెగా టోర్నమెంట్. ఇప్పటివరకు ఎంతో మంది కొత్త ప్లేయర్లను, స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లను అందించిన సూపర్ లీగ్. ప్రతి సీజన్ లో కొత్త ప్లేయర్లు ఎంట్రీ ఇస్తూ అద్భుత ప్రదర్శన చేసి జాతీయ జట్టులోకి వచ్చినవారు చాలా మందే ఉన్నారు. ఈ సీజన్ లో (ఐసీఎల్ 2024) లో కూడా పలువురు ప్లేయర్లు అరంగేట్రం చేశారు. వస్తూ వస్తూనే అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ తో దుమ్మురేపుతూ భారత జట్టులోకి తమను కూడా తీసుకోవాలనే సూచనలు పంపుతున్నారు. అలా ఐపీఎల్ 2024లో అరంగేట్రం చేసిన ప్లేయర్లను గమనిస్తే..
మయాంక్ యాదవ్ :
ఢిల్లీకి చెందిన ఈ యంగ్ పేసర్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్ జట్టులో భాగంగా ఉన్నాడు. తన అద్భుతమైన పేస్ బౌలింగ్ తో అదరగొడుతూ నిప్పులు చెరిగే బౌలింగ్ వేస్తున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను తన బౌలింగ్ తో హడలెత్తిస్తున్నారు. ఐపీఎల్ 2024 లో లక్నో టీమ్ నుంచి అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్ తన తొలి మ్యాచ్ లో సూపర్బ్ ఇన్నింగ్స్ దుమ్మురేపాడు. పంజాబ్ కింగ్స్‌పై అరంగేట్రం చేసిన మయాంక్ ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి మ్యాచ్ విన్నింగ్ ఆటను ప్రదర్శించాడు. అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 14 పరుగులిచ్చి కీలకమైన 3 వికెట్లు తీసి నిప్పులు చెరిగే బౌలింగ్ ప్రదర్శనతో మెరిశాడు. బెంగళూరు బౌలర్లపై నిప్పులు చెరిగే బౌలింగ్ తో 156.7 కిలో మీటర్ల వేగంతో బంతి వేసి ఈ సీజన్ లో అత్యంత వేగవంతమైన బాల్ విసిరిన ప్లేయర్ గా ఘనత సాధించాడు. వరుసగా రెండు మ్యాచ్ లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు ఈ 21 ఏండ్ల కుర్రాడు మయాంక్ యాదవ్.
రింకూ సింగ్ తో పెట్టుకుంటే అంతే మరి.. !
అంగ్క్రిష్ రఘువంశీ
ఈ సీజన్ లో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న మరో యంగ్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ. వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ 2024లో బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోనే తుదిజట్టులో చోటుదక్కించుకుని ఐపీఎల్ 2024లో అరంగేట్రం చేసిన ఈ యంగ్ ప్లేయర్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక రెండో మ్యాచ్ లో తొలిసారి బ్యాటింగ్ అవకాశం రావడంతో సూపర్ ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 27 బంతుల్లోనే 54 పరుగుల తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ 18 ఏళ్ల యంగ్ ప్లేయర్ 2022 అండర్ 19 ప్రపంచ కప్‌లో కేవలం 6 ఇన్నింగ్స్‌లలో 278 పరుగులు చేసిన భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ 20 లక్షల రూపాయలకు రఘువంశీని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఐపీఎల్ 2024లో మరిన్ని మంచి ప్రదర్శనలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు.
తనను కిందపడేసిన ఇషాంత్ శర్మను మెచ్చుకున్న ఆండ్రీ రస్సెల్ ! నువ్వు గ్రేట్ సామి..