పియూష్ చావ్లాకి ఓటు... హర్భజన్ సింగ్‌కి నిరాశ... ఫ్రాంఛైజీల ఆలోచన ఏంటి?

By team teluguFirst Published Feb 18, 2021, 5:03 PM IST
Highlights

ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ముగ్గురు ప్లేయర్లకు రూ.14 కోట్లకి పైగా ధర..

భజ్జీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని జట్లు...

ఐపీఎల్ 2021 మినీ వేలంలో భారత సీనియర్ స్పిన్నర్, ‘టర్బోనేటర్’ హర్భజన్ సింగ్‌కి నిరాశే ఎదురైంది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలానికి వచ్చిన హర్భజన్ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. అయితే మరో సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా కోసం ఢిల్లీ, ముంబై జట్లు పోటీపడ్డాయి. రూ.2.40 లక్షలకు పియూష్ చావ్లాను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. 

హర్భజన్ సింగ్ ఇంతకుముందు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకి ఆడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు రూ.14 కోట్ల కంటే ఎక్కువ ధర దక్కించుకోవడం విశేషం. క్రిస్ మోరిస్‌ను రూ.16 కోట్ల 25 లక్షల రికార్డు ప్రైజ్‌కి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ.14 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

జే రిచర్డ్‌‌సన్‌ను రూ. 14 కోట్లకి కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. మొయిన్ ఆలీకి రూ.7 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది సీఎస్‌కే. ఐపీఎల్ వేలం చరిత్రలోనే ముగ్గురు ప్లేయర్లు రూ.14 కోట్లు దాటడం ఇదే మొదటిసారి. 

click me!