IPL Auction 2021: ఎవరీ జే రిచర్డ్‌సన్... వేలంలో ఏకంగా రూ.14 కోట్లు కొల్లగొట్టిన యంగ్ బౌలర్...

By team teluguFirst Published Feb 18, 2021, 4:49 PM IST
Highlights

బిగ్‌బాష్‌ లీగ్‌లో అదరగొట్టిన జే రిచర్డ్‌సన్...

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన జే రిచర్డ్‌సన్...

సామ్ బిల్లింగ్స్, గ్లెన్ ఫిలిప్స్, అలెక్స్ క్యారీలను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. న్యూజిలాండ్ క్రికెటర్ ఆడమ్ మిల్నే‌ను కొనుగోలు చేయడానికి రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి.

ముంబై ఇండియన్స్ జట్టు రూ.3 కోట్ల 20 లక్షలకు ఆడమ్ మిల్నేను కొనుగోలు చేసింది. ముస్తాఫిజుర్ రహ్మామ్‌ను రూ. కోటికి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. బిగ్‌బాష్ లీగ్ సీజన్ 10లో అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా యంగ్ బౌలర్ జే రిచర్డ్‌సన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి.

పోటీ తీవ్రంగా మారడంతో ఏకంగా రూ .14 కోట్లకు జే రిచర్డ్‌సన్‌ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. నాథన్ కౌంటర్‌నీల్ కోసం ముంబై, ఢిల్లీ జట్లు పోటీపడ్డాయి. రూ.5 కోట్లకు నాథన్ కౌంటర్‌నీల్‌ను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.

విండీస్ ఆల్‌రౌండర్ షెల్డ్రెన్ కాంట్రెల్, అదిల్ రషీద్‌‌ను ఏ జట్టు కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. ఉమేశ్ యాదవ్‌ను రూ. కోటి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 
 

click me!