IPL Auction 2021: గత సీజన్ లో ఒక్క సిక్సర్ కూడా కొట్టని మాక్స్ వెల్, అయినా...

By telugu teamFirst Published Feb 18, 2021, 4:25 PM IST
Highlights

గత ఐపిఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. అందుకు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నుంచి విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

చెన్నై: గత సీజన్ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. పేలవమైన ప్రదర్శనే కనబరిచాడు. అయినా ఐపిఎల్ 2021లో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. మాక్స్ వెల్ విధ్వంసకరమైన బ్యాట్స్ మన్ మాత్రమే కాకుండా మంచి బౌలర్ కూడా. 

భారత ఆస్ట్రేలియా పర్యటనలో మాక్స్ వెల్ విశేషమైన ప్రతిభను కనబరిచాడు. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రాణించాడు. అందువల్లనే మాక్స్ వెల్ కోసం ఐపిఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడి ఉంటాయి. 

గ్లెన్ మాక్స్ వెల్ కోసం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడ్జాయి. రూ. 2రోట్లతో ప్రారంభమైన అతని ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. చివరకు రూ.14 కోట్ల 25 లక్షలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ అతన్ని దక్కించుకుంది. గత వేలంలో మాక్స్ రూ.10 కోట్ల 25 లక్షలకు అమ్ముడుపోయాడు.

గత సీజన్ లో అతని పేలవమైన ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. అయినప్పటికీ ఈ సీజన్ లో మళ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ గతంలో కన్నా ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసింది. 

ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్వాగతోపన్యాసం చేశారు. బీసీసీఐ కార్యదర్శి జె. షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ దుమాల్ హాజరయ్యారు. ఐపిఎల్ ప్రకటనదారులకు, భాగస్వాములకు బ్రిజేష్ పటేల్ ధన్యవాదాలు తెలిపారు. 

click me!